జగన్ సర్కార్ మీద అతి పెద్ద బండ వేసిన సోము ?

ఏపీలో రాజకీయం మారుతోంది. ప్రజా సమస్యల మీద పోరాటం లేదు, విభజన హామీల గురించిన చర్చ లేదు. ప్రత్యేక హోదాలు ముగిసిన అధ్యాయాలు అయిపోయాయి. ప్యాకేజీల ఊసు అంతకంటే లేదు. ఇక రెవిన్యూ లోటు…

ఏపీలో రాజకీయం మారుతోంది. ప్రజా సమస్యల మీద పోరాటం లేదు, విభజన హామీల గురించిన చర్చ లేదు. ప్రత్యేక హోదాలు ముగిసిన అధ్యాయాలు అయిపోయాయి. ప్యాకేజీల ఊసు అంతకంటే లేదు. ఇక రెవిన్యూ లోటు కానీ, పోలవరం నిధుల గురించి కానీ పట్టడంలేదు.

కానీ అర్జంటుగా మతం చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవడానికి మాత్రం  రాజకీయ పక్షాలు తెగ  ఆరాటపడుతున్నాయి. ఇందులో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా మరొకరు అయినా ఒక్కటే.

ఇక హిందూ కార్డు మీద ఫుల్ పేటెంట్ హక్కులు తనకే ఉన్నాయని గొప్పగా చెప్పుకునే బీజేపీ అయితే ఏపీ పరిణామాలను పూర్తిగా వాడుకుంటోందనుకోవాలి.  సోము వీర్రాజు అయితే ఇదే విషయమై జగన్ సర్కార్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.

అర్జంటుగా ఏపీలోని చర్చిల ఆస్తుల వివరాలు కావాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విడ్డూరమే. అంతే కాదు దీని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. అదే సమయంలో హిందూత్వాన్ని రాష్ట్రంలో అస్థిర పరచేందుకు  ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంటూ ఏకంగా జగన్ ప్రభుత్వం మీద అతి పెద్ద బండ వేశారు.

మతం మార్చడానికే పాస్టర్లకు జీతలు చెల్లిస్తున్నారాంటూ నిలదీశారు. మొత్తాని ఏపీలో రాజకీయం మారిపోయింది. తమ‌కు కావాల్సిన విధంగా నేతలు  అజెండా సెట్ చేసి పెట్టుకున్నారు.  ఇపుడు ఈ రాజకీయాలు ఏ వైపునకు కీలక మలుపు తిరుగుతాయో చూడాల్సిందే.

జగన్ పై దొంగదెబ్బే గత్యంతరమా?

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం