రేపే ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

ఆదిపురుష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజు రాత్రి మరోసారి డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడి, రేపు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగులో…

ఆదిపురుష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజు రాత్రి మరోసారి డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడి, రేపు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగులో ఆదిపురుష్ ను విడుదల చేస్తున్న టీజీ విశ్వప్రసాద్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది.

“రేపు మార్నింగ్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకోవడం వల్ల కాస్త లేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. అయితే 50 రూపాయలు పెంచాలా, 25 రూపాయలు పెంచాలా అనేది ఆలోచిస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి, 25 రూపాయల పెంపునకు వెళ్దామని అనుకుంటున్నాం. మల్టీప్లెక్సుల్లో ఆల్రెడీ ఫ్లెక్సీ రేట్లు ఉన్నాయి. మ్యాగ్జిమమ్ ఎంత రేటు వరకు పెంచుకోవచ్చో, అంత రేటుకు వెళ్తాం.”

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవో కాపీ తయారవ్వడం కాస్త లేట్ అయిందని, లేకపోతే ఈపాటికే ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై ఉండేదని అన్నారు విశ్వప్రసాద్. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఆల్రెడీ అమల్లో ఉన్న మార్గదర్శకాల్నే ఫాలో అవుతున్నామని చెప్పారు.

ఇక ఆదిపురుష్ సినిమా టికెట్లను కొంతమంది ప్రముఖులు గంపగుత్తగా కొనుగోలు చేయడంపై కూడా నిర్మాత స్పందించారు. అది మార్కెటింగ్ స్ట్రాటజీ కాదని స్పష్టం చేశారు. “ప్రముఖులు టిక్కెట్లు కొనడం అనేది పబ్లిసిటీ స్ట్రాటజీ కాదు. భక్తితో చేస్తున్నారు. రాముడికి తమవంతు సేవ అన్నట్టు టిక్కెట్లు కొంటున్నారు. అది వాళ్ల నమ్మకం, వాళ్ల సొంత నిర్ణయం అది.” అంటూ స్పందించారు.

సినిమా రిలీజ్ టైమ్ కు అమెరికాలో ఉంటారు విశ్వప్రసాద్. ఓవర్సీస్ లో ఆయన ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ ఈవెంట్స్ కు ప్రభాస్ రావడం లేదని కూడా స్పష్టం చేశారు.