భోగాపురానికి వైభోగం…!

ఎక్కడి భోగాపురం. మరెక్కడ అంతర్జాతీయ సమాజం. ఈ రెండింటికీ అనూహ్యంగా లింక్ కుదరబోతొంది. విజయనగరం జిల్లాలో ఉన్న పల్లెకారు భోగాపురం ఇకపైన అంతర్జాతీయ వేదికల మీద కదలాడే అవకాశం  ఉంది. అక్కడ నుంచి ప్రపంచానికి…

ఎక్కడి భోగాపురం. మరెక్కడ అంతర్జాతీయ సమాజం. ఈ రెండింటికీ అనూహ్యంగా లింక్ కుదరబోతొంది. విజయనగరం జిల్లాలో ఉన్న పల్లెకారు భోగాపురం ఇకపైన అంతర్జాతీయ వేదికల మీద కదలాడే అవకాశం  ఉంది. అక్కడ నుంచి ప్రపంచానికి విమానాలు ఎగరబోతున్నాయి.

దీనికి ప్రతిపాదనలు ఎవరు చేసినా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా దీని కధ మొదలుకాబోతూండడమే విశేషం.  భోగాపురం అంతర్జాతీయ విమాశ్రయానికి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ శంఖుస్థాపన చేస్తారని తెలుస్తోంది.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ కింద  ప్రఖాత సంస్థ జీఎమ్మార్ తో కలసి ప్రభుత్వం ఎయిర్ పోర్టుని నిర్మించనుంది. 2,203 ఎకరాల్లో ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుని అభివృద్ధి చేయనున్నారు. ఇక భూ సేకరణ కూడా ఒక కొలిక్కి వచ్చింది. కేవలం మరో 120 ఎకరాలు సేకరణను ఈ నెలాఖరులో పూర్తి చేస్తే నిర్మాణానికి రెడీ అయిపోవచ్చు. 

మూడేళ్ల కాలపరిమితిలో ఈ ఎయిర్ పొర్టుని అందుబాటులోకి తీసుకురావలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మొత్తానికి ఉత్తరాంధ్రాలో  అద్భుతమైన ప్రగతికి అడుగులు వడివడిగా పడనున్నాయి.

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు