ఆ రెండు సినిమాల్లో సమంత డౌటే!

యశోద, శాకుంతలం సినిమాల తరువాత హీరోయిన్ సమంత చేస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావస్తోంది. మహా అయితే మరో నెలలో ఈ సినిమా వర్క్ కూడా అయిపోతుంది.  Advertisement…

యశోద, శాకుంతలం సినిమాల తరువాత హీరోయిన్ సమంత చేస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావస్తోంది. మహా అయితే మరో నెలలో ఈ సినిమా వర్క్ కూడా అయిపోతుంది. 

కానీ ఈ సినిమా తరువాత సమంత చేయబోయే తెలుగు సినిమా ఏమిటన్నది ఇంకా క్లారిటీ లేదు. రెండు సినిమాలకు సమంత పేరు పరిశీలనలో వుందనే టాక్ వుంది. కానీ ఈ రెండు సినిమాల విషయంలో సమంత చేస్తుందా చేయదా అన్న క్లారిటీ మాత్రం లేదు.

కానీ గమ్మత్తేమిటంటే సమంత హీరోయిన్ గా చేసే అవకాశం వుందని వినిపిస్తున్న రెండు సినిమాల్లోనూ హీరో సిద్దు జొన్నలగడ్డనే. రెండింటికీ మహిళా దర్శకులే పని చేస్తున్నారు. నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ సినిమా ఒకటి. నీరజ కోన దర్ళకత్వంలో సిద్దు జొన్నలగడ్డ సినిమా ఇంకోటి. ఈ రెండింటికీ సమంత సెట్ అవుతుంది అనే అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాల్లోనూ సమంత డౌటే అని వినిపిస్తోంది. చేస్తే ఏదో ఒక సినిమానే చేయాల్సి వుంటుంది. కానీ రెండింటిలోనూ చేయడం అనుమానమే అని తెలుస్తోంది. ఖుషీ పూర్తయ్యేలోగా, కాస్త భారీ, మంచి ప్రాజెక్ట్ కోసం సమంత వెయిట్ చేస్తారని బోగట్టా.