రవితేజ ప్రయోగం ఫలించింది

పెద్ద హీరోలు రెమ్యూనిరేషన్ కు బదులుగా వేరే స్కీమ్ అమలు చేయడం అన్నది కామన్ నే. అయితే రవితేజ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు.  Advertisement తొలిసారి రెమ్యూనిరేషన్ రూపాయి తీసుకోకుండా సినిమా చేసేసాడు. అంతే…

పెద్ద హీరోలు రెమ్యూనిరేషన్ కు బదులుగా వేరే స్కీమ్ అమలు చేయడం అన్నది కామన్ నే. అయితే రవితేజ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు. 

తొలిసారి రెమ్యూనిరేషన్ రూపాయి తీసుకోకుండా సినిమా చేసేసాడు. అంతే కాదు రెమ్యూనిలరేషన్ సెటిల్మెంట్ కాకుండా డబ్బింగ్ కూడా చెప్పాడు. 

ఆ సినిమానే గోపీచంద్ మలినేని డైరక్షన్ లో  టాగోర్ మధు నిర్మించిన క్రాక్. రామ్ లక్ష్మణ్ సూపర్ ఫైట్లు, థమన్ సంగీతం, విష్ణు మాంచి సినిమాటోగ్రఫీ తో  ఈ సినిమా జనాలకు బాగానే పట్టేసింది.

ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ కు బదులుగా నైజాం, వైజాగ్ హక్కులు తీసుకున్నాడు. ఇప్పుడు క్రాక్ సినిమా వల్ల రవితేజకు బాగానే కిట్టుబాటు అయ్యేలా వుంది. నైజాం నుంచి ఆరు కోట్లకు పైగా వచ్చింది. 

వైజాగ్ టోటల్ రన్ లో మూడున్నర కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి సీజన్ ఉత్తరాంధ్రలో సినిమాలకు బాగుంటుంది. టోటల్ గా పది కోట్లకుపైగా రెమ్యూనిరేషన్ గిట్టుబాటు అయినట్లయింది. 

ఇలా చేయడం వల్ల అటు నిర్మాతకు వడ్డీలు మిగులు. ఇటు హీరోకు కావాల్సిన రెమ్యూనిరేషన్ వచ్చింది. సరైన ప్రాజెక్టులు ఎంచుకుని ఇలాంటి స్కీములు అమలు చేస్తే ఉభయకుశలోపరిగా వుంటుంది.

మంచి కిక్‌ ఇచ్చారు

ఈ సంక్రాంతి అల్లుడు నేనే