రాజ్య‌స‌భకు ప్ర‌ముఖ క్రికెట‌ర్‌

ప్ర‌ముఖ క్రికెట‌ర్‌కు రాజ్య‌స‌భ సీటు ద‌క్కింది. ఇంత కాలం మైదానంలో క్రికెట్ ఆడుతూ క్రీడాభిమానుల‌ను అల‌రించిన హ‌ర్భ‌జ‌న్ సింగ్, ఇక‌పై దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో త‌న గ‌ళాన్ని వినిపించ‌నున్నారు. స్పిన్ బౌల‌ర్‌గా , బ్యాట‌ర్‌గా…

ప్ర‌ముఖ క్రికెట‌ర్‌కు రాజ్య‌స‌భ సీటు ద‌క్కింది. ఇంత కాలం మైదానంలో క్రికెట్ ఆడుతూ క్రీడాభిమానుల‌ను అల‌రించిన హ‌ర్భ‌జ‌న్ సింగ్, ఇక‌పై దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో త‌న గ‌ళాన్ని వినిపించ‌నున్నారు. స్పిన్ బౌల‌ర్‌గా , బ్యాట‌ర్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయ‌న‌. హ‌ర్భ‌జ‌న్‌ను రాజ్య‌స‌భ‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధ్య‌క్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంపిక చేశారు.

ఇటీవ‌ల పంజాబ్ ఎన్నిక‌ల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను ఆప్ మ‌ట్టి క‌రిపించింది. పంజాబ్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ వ్యాప్త దృష్టిని ఆర్షించింది. హ‌ర్భ‌జ‌న్‌తో పాటు ఆప్ నేత‌లైన రాఘ‌వ‌న్ చ‌ద్దా, ప్రొఫెస‌ర్ సందీఫ్ పాఠ‌క్‌ల‌ను రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

హర్భ‌జ‌న్‌సింగ్‌ను ఎంపిక చేయ‌డం ద్వారా క్రీడారంగంతో పాటు యువ‌త‌ను త‌న పార్టీ వైపు ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని కేజ్రీవాల్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. రాఘ‌వ్ చ‌ద్దా ఢిల్లీ ఎమ్మెల్యే. కానీ పంజాబ్ ఇన్‌చార్జ్‌గా ఆయ‌న పార్టీ బ‌లోపేతానికి కృషి చేశారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రావ‌డానికి రాఘ‌వ్ పాత్ర కూడా ఉంది. 

పంజాబ్‌లోని ఏడు రాజ్య‌స‌భ స్థానాల్లో ఐదింటికి ఈ నెల 31న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పంజాబ్‌లో ఆప్ తిరుగులోని మెజార్టీ క‌లిగి ఉండ‌డంతో ఆ పార్టీ అభ్య‌ర్థులంతా విజ‌యం సాధిస్తారు.