సీఎం రమేష్…అసలైన బీజేపీ నేత !

సీఎం రమేష్ అంటే ఏపీ రాజకీయాల్లో ఎవరికైనా గుర్తుకు వచ్చేది చంద్రబాబు రైట్ హ్యాండ్ అని. అలాగే ఆయన ఎదిగారు. రెండు సార్లు రాజ్య సభ ఎంపీగా నామినేట్ చేసింది చంద్రబాబే. ఆయన టీడీపీ…

సీఎం రమేష్ అంటే ఏపీ రాజకీయాల్లో ఎవరికైనా గుర్తుకు వచ్చేది చంద్రబాబు రైట్ హ్యాండ్ అని. అలాగే ఆయన ఎదిగారు. రెండు సార్లు రాజ్య సభ ఎంపీగా నామినేట్ చేసింది చంద్రబాబే. ఆయన టీడీపీ ఎంపీగా బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలో ఆయన ఏపీ నుంచి ఉన్న ఏకైక ఎంపీ.

సీఎం రమేష్ నాలుగేళ్ల క్రితం బీజేపీలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీని ఏ రోజూ పల్లెత్తు మాట అనలేదు అని వైసీపీ నేతలు అంటారు. ఆయన ఎక్కడ ఉన్నా బాబు టీడీపీని మరచిపోరని కూడా వెటకారం చేస్తారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతల సంగతి ఏమో కానీ సీఎం రమేష్ లాంటి వారు మాత్రం అసలైన బీజేపీ నేతలం తామే అని అన్నట్లుగా వ్యవహరిస్తారు అంటున్నారు.

అమిత్ షా పర్యటన నేపధ్యంలో విశాఖ వచ్చిన సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ పొత్తుల గురించి ఏపీకి నిధుల వరకూ అన్నీ మాట్లాడేశారు. ఒక విధంగా ఆయనే బీజేపీ కేంద్ర మంత్రి అన్నట్లుగా అన్నీ చెప్పేశారు. ఏపీలో బీజేపీతో కలసి ఉండే ప్రభుత్వమే 2024లో వస్తుంది అని రమేష్ చెప్పారు. పొత్తుల విషయం మాట్లాడను అంటూనే పవన్ కళ్యాణ్ పాటే ఈయనా పాడారు.

వైసీపీ వ్యతిరేక ఓటు ఏపీలో చీలనివ్వమని చెప్పారు. పోలవరానికి తాము నిధులు పూర్తిగా ఇస్తున్నామని చెబుతూ రెండు రోజుల్లో ఆ నిధులు రిలీజ్ అవుతాయని డేట్ టైం కూడా చెప్పేశారు. ఏపీలో వైసీపీని గద్దె దించడమే ధ్యేయం అన్నారు. జనసేన మిత్రపక్షం అంటూనే టీడీపీ గురించి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.

ఏపీలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి ఎవరూ లేరు. రాజ్యసభ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కి ఆ పదవి ఇచ్చి ఉంటే బాగుండేది అని అంటున్నారు. ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వం తరఫున బీజేపీ జాతీయ పార్టీ తరఫున అంత గట్టిగా మాట్లాడుతున్న వేళ ఆ పదవి ఏదో ఇచ్చేస్తే లాంచనం కూడా పూర్తి అయినట్లుగా ఉంటుందని సెటైర్లు అయితే పడుతున్నాయి. బీజేపీలో అసలు కాషాయం నేతల కంటే కొసరు నేతలకే వాల్యూ వాయిస్ ఎక్కువ అంటే ఇదేనేమో అంటున్నారు.