తల్లి కాబోతున్న నటి స్వరా భాస్కర్!

ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి స్వరా భాస్కర్ త‌ల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా త‌న భ‌ర్త ప‌హాద్ అహ్మాద్ తో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానులకు ట్వీట్ట‌ర్…

ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి స్వరా భాస్కర్ త‌ల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా త‌న భ‌ర్త ప‌హాద్ అహ్మాద్ తో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానులకు ట్వీట్ట‌ర్ వేదిన‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. 

“కొన్నిసార్లు మాన‌ ప్రార్థనలన్నింటికీ సమాధానం లభిస్తుంది! మేము సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం.. ఆశీర్వాదం, కృతజ్ఞత, ఉత్సాహం..  #త్వరలో #కుటుంబం #అక్టోబర్ బేబీ” అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. దీంతో స్వరా భాస్కర్‌, ఆమె భ‌ర్త‌ ప‌హాద్ అహ్మాద్ కు శుభాకాంక్షలు చెబుతూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

కాగా సోషల్‌ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే నటి స్వరా భాస్కర్ ఫిబ్రవరిలో సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగం నాయకుడు ఫహాద్‌ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. వివిధ రాజకీయ అంశాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పే స్వరా భాస్కర్‌.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాకు చిరపరిచితురాలు. తను వెడ్స్ మను, రాంఝానా, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలలో ఆమె నటించారు. రాస్భరీ అనే వెబ్‌ సిరీస్‌లో కూడా నటించింది.