అమిత్ షా సభా భారం…కమలానికి కఠిన పరీక్ష

విశాఖకు అమిత్ షా రాక రాక వస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రా ముఖ ద్వారంలోకి అడుగు పెడుతున్నారు. బీజేపీకి మొదటి నుంచి కాస్తో కూస్తో పట్టు ఉన్న సిటీగా విశాఖను చెప్పుకుంటారు. హోల్ మొత్తం సౌతిండియాలో…

విశాఖకు అమిత్ షా రాక రాక వస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రా ముఖ ద్వారంలోకి అడుగు పెడుతున్నారు. బీజేపీకి మొదటి నుంచి కాస్తో కూస్తో పట్టు ఉన్న సిటీగా విశాఖను చెప్పుకుంటారు. హోల్ మొత్తం సౌతిండియాలో బీజేపీ విశాఖ కార్పోరేషన్ ని 1980 ప్రాంతంలో గెలిచి కమలానికి బోణి  కొట్టించింది.

అలా గేట్ వే ఆఫ్ సౌతిండియా అని వాజ్ పేయ్ హయాంలో పేరు పొందిన విశాఖ నుంచే బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గెలిచిన చరిత్ర ఉంది.  విశాఖలో మరోసారి లక్ టెస్ట్ చేసుకుందామని బీజేపీ ప్రయత్నంలో భాగమే అమిత్ షా పర్యటన.

ఈ నెల 8న అమిత్ షా విశాఖ వస్తున్నారు. ఆయన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇపుడు అదే బీజేపీ నేతలకు పెద్ద పరీక్షగా మారుతోంది. గత ఏడాది చివరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చినపుడు భారీ జన సమీకరణను వైసీపీ చేసి బీజేపీ పరువు కాపాడింది. ఒక విధంగా బీజేపీకి ఖర్చు కష్టాన్ని తగ్గించింది.

ఇపుడు అమిత్ షా విశాఖ పర్యటన పూర్తిగా పార్టీ కార్యక్రమంగా ఉంది. విశాఖ సభ సక్సెస్ కావాలంటే జనాలు పెద్ద ఎత్తున కనిపించాలి. బీజేపీ లీడర్స్ ఆ పనిలో బిజీగా ఉన్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు విశాఖలో ఉంటూ అమిత్ షా సభకు జన సమీకరణ మీద లోకల్ లీడర్స్ కి ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అమిత్ షా సభ అదిరిపోవాలని పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.

ఈ సభకు జనాలను సమీకరించడం అన్నది అంత సులువైన వ్యవహారం కాదు. మిత్ర పక్షం జనసేన కూడా కలసి వస్తే అమిత్ షా సభ కళకళలాడుతుంది అంటున్నారు. గతంలో మోడీ విశాఖ వచ్చినపుడు కూడా ఎక్కడా జనసేన క్యాడర్ సందడి కనిపించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి జనసేన నుంచి సహకారం లేదు

పేరుకు మిత్రపక్షం కానీ ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంది. అయినా ఇది బీజేపీ సొంత సభ కాబట్టి జనసేన దూరంగానే ఉండిపోతుంది అంటున్నారు. అమిత్ షా ముందు ఏపీ రాజకీయ పక్షాల ముందు విశాఖ సభను సక్సెస్ చేయాల్సిన కఠిన పరీక్షలో బీజేపీ నేతలు ఉన్నారు. సభకు వచ్చే జనాల బట్టే బీజేపీ యాక్టివిటీ ఏంటి అన్నది అమిత్ షా కూడా అంచనా వేస్తారని అంటున్నారు.