త్రివిక్రమ్ కు చెప్పాలనిపించలేదా?

త్రివిక్రమ్ కు మామగారి వరుస..సిరివెన్నెల సీతారామశాస్త్రి.. పైగా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఎక్కువగా పెరిగింది సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబంలోనే. త్రివిక్రమ్ కు పరిచయం కూడా అక్కడే. సంబంధం కుదిర్చింది సిరివెన్నెలే. అలాంటి కుటుంబం…

త్రివిక్రమ్ కు మామగారి వరుస..సిరివెన్నెల సీతారామశాస్త్రి.. పైగా త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఎక్కువగా పెరిగింది సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబంలోనే. త్రివిక్రమ్ కు పరిచయం కూడా అక్కడే. సంబంధం కుదిర్చింది సిరివెన్నెలే. అలాంటి కుటుంబం కష్టంలో వున్నపుడు అన్ని విధాలా ఆదుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వమే. 

సిరివెన్నెల అనారోగ్యంతో వుంటే లక్షలకు లక్షలు ఆసుపత్రి ఖర్చులు అన్నీ ఆంధ్ర ప్రభుత్వమే భరించింది. మరణించిన తరువాత కూడా విశాఖలో విలువైన స్థలం కేటాయించింది.

ఇన్ని చేసినా ఎప్పుడూ త్రివిక్రమ్ ఓ థాంక్స్ నోట్ ఇవ్వాలనిపించలేదు. జగన్ ప్రభుత్వం సిరివెన్నెల కుటుంబం పట్ల ప్రవర్తించిన ప్రశంసాపాత్రమైన తీరు పట్ల ఓ మంచి మాట అనాలని అనిపించలేదు.

కానీ తెలంగాణ ప్రభుత్వం మీద ప్రశంసలు కురింపించారు. కేసిఆర్ పట్ల అభిమానం ప్రకటించారు. దాంట్లో తప్పు పట్టడానికి లేదు. తెలంగాణను అభివృద్ది పథంలో నడిపిస్తున్న కేసిఆర్ పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల ఆ మాత్రం నాలుగు మంచి మాటలు చెప్పడం సర్వదా అభినందనీయమే. కానీ అదే ఆదరణ, అభిమానం ఆంధ్ర ప్రభుత్వం మీద మాత్రం లేకపోయె.

పోనీ జగన్ ప్రభుత్వం అభివృద్ది చేయలేదో, చేయలేదని త్రివిక్రమ్ భావించారో ఎప్పుడూ అలా ప్రకటించే సందర్భం రాలేదో అని సరిపెట్టుకుందాం. కనీసం తన పినమామగారు, తన అభిమాన కవి సిరివెన్నెల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుకైనా ఓ మంచి మాట అనాలి కదా. 

చిన్న అభినందన, చిన్న పాటి ప్రశంస కూడా నోచుకొలేదా జగన్ ప్రభుత్వం సిరివెన్నెల కుటుంబం పట్ల కనబర్చిన ఈ ఉదార, ప్రేమ పూర్వక వైఖరి? అలా ప్రశంసిస్తే తన సన్నిహితుడు పవన్ కు కోపం వస్తుదని ఊరుకున్నారా? ఏమో? సమాధానం త్రివిక్రమ్ కే తెలియాలి.