ఆదిపురుష్ బిజినెస్ డిటైల్స్

ఈ ఏడాది కి ఇవే హయ్యస్ట్ బిజినెస్ ఫిగర్స్. ఇంకా ఎవరికి ఇస్తారు..ఎవరు తీసుకుంటున్నారు అన్నవి బయట పెట్టడం లేదు కానీ, రేట్లు అయితే మాత్రం ఫిక్స్ అయిపోయాయి. ఆ రేట్లకే అమ్మకాలు వుంటాయి.…

ఈ ఏడాది కి ఇవే హయ్యస్ట్ బిజినెస్ ఫిగర్స్. ఇంకా ఎవరికి ఇస్తారు..ఎవరు తీసుకుంటున్నారు అన్నవి బయట పెట్టడం లేదు కానీ, రేట్లు అయితే మాత్రం ఫిక్స్ అయిపోయాయి. ఆ రేట్లకే అమ్మకాలు వుంటాయి. ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ కలిపి 160 కోట్లు ప్లస్ జిఎస్టీ కి పీపుల్స్ మీడియా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాను పీస్ రేట్ల లెక్కన అమ్మాల్సి వుంది. జిఎస్టీల మాట ఎలా వున్నా 160 కోట్లు రావాలి అంటే భారీ రేషియోల్లో విక్రయించాల్సి వుంది.

పీపుల్స్ మీడియా సంస్థ ఆంధ్ర ఏరియాకు 80 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అడుగుతోంది. కావాలంటే అందులో ఓ పది కోట్లు కాస్త అటు ఇటుగా రికవరీకి అనుమతిస్తామనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, నెల్లూరు యువి సంస్థనే తీసుకుంటోంది. మిగిలిన ఏరియాలు ఫిక్స్ కావాలి. ఒక్క కృష్ణా మినహా మిగిలిన చోట్ల డిమాండ్ బాగానే వుంది.

ఇక నైజాం ఏరియాకు మాత్రం 60 కోట్ల నాన్ రికవరబుల్ అడ్వాన్స్ ను కోరుకుంటోంది. ఈ మేరకు రెండు పార్టీలతో డిస్కషన్లు సాగుతున్నాయి. అయితే దిల్ రాజు లేదా మైత్రీ మూవీస్ కు హక్కులు దక్కుతాయి.

సీడెడ్ కు 25 కోట్లు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ ను ఆశిస్తున్నారు. ఇక్కడ రెండు మూడు పార్టీలు లైన్ లో వున్నాయి. ఇలా మూడు వస్తే కనుక 165 కోట్ల మేరకు రికవరీ వస్తుంది. ప్రతి చోటా ఎంక్వయిరీలు బాగానే వున్నాయి కానీ రేట్ల దగ్గరే ఇంకా బేరాలు కుదరడం లేదు. 

ఈ రేట్లు వస్తే తప్ప పీపుల్స్ మీడియాకు గిట్టుబాటు కాదు. అది కూడా ఎక్కువ రికవరీ పెడితే సమస్య అవుతుంది. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకాలు పూర్తిగా వున్నాయి. కానీ ఏమాత్రం తేడా వచ్చినా రికవరీ పెడితే హోల్ సేల్ బయ్యర్ కు సమస్యే అవుతుంది.

మొత్తం మీద ఆదిపురుష్ బిజినెస్ ఎలా క్లోజ్ అవుతుంది అన్నది కాస్త ఇంట్రస్టింగ్ టాపిక్ గానే వుంది.