రాముడి చుట్టూ బోడి రాజకీయం?

విజయ‌నగరం జిల్లాలోని రామతీర్ధం అతి చిన్న ఆధ్యాత్మిక కేంద్రం. ఆ ఆలయన్ని ఆనుకుని బోడి కొండ ఉంది. ఆ పైన కోదండ రాముడు ఆలయం ఉంటుంది. బోడి కొండ మీద ఉన్న రాముడి కోవెలకు…

విజయ‌నగరం జిల్లాలోని రామతీర్ధం అతి చిన్న ఆధ్యాత్మిక కేంద్రం. ఆ ఆలయన్ని ఆనుకుని బోడి కొండ ఉంది. ఆ పైన కోదండ రాముడు ఆలయం ఉంటుంది. బోడి కొండ మీద ఉన్న రాముడి కోవెలకు వెళ్లాలంటే 500 మెట్లు ఎక్కాలి.

మన రాజకీయ నాయకులకు రామతీర్ధాలు వెళ్ళడమే చాలా కష్టం. అలాంటిది బోడి కొండ కోసం వందల మెట్లు ఎక్కి ఆయాసపడే రాజకీయ నాయకులు ఉంటారా. కానీ ఇపుడు మాత్రం బోడి కొండా కావాలి. దాని చుట్టూ రాజకీయమూ కావాలి.

రామతీర్ధం అభివృద్ధిని పట్టని నాయకులు కూడా అయ్యో రాముడు అంటూ బోడి రాజకీయాలే చేస్తున్నారు అంటూ స్థానికులు విమర్శలు చేస్తున్నారంటే మన నేతాశ్రీల రేంజి అర్ధమవుతోందిగా.

బోడి కొండ ఆలయాన్ని కనీసం నడిచేందుకు అందరూ వెళ్ళేందుకు అనువుగా మార్చగలిగారా అంటే అదీ లేదు. ఇపుడు ఆ పైన ఉన్న కోదండరాముడి శిరస్సు ఖండించారని వార్త రావడంతో తండోపండాలుగా రాజకీయ జీవులు వచ్చి దండయాత్రే చేస్తున్నారని స్థానిక జనం అనుకోవడంలో తప్పేముంది.

విజయన‌గరం జిల్లాలో రెండు జ్యూటు మిల్లులు మూతపడి ఏళ్ళు గడుస్తున్నాయి. అక్కడి కార్మికులు ఆకలి మంటతో అల్లాడుతున్నారు. వారి తరఫున మాట్లాడడానికి నోరు లేని రాని నాయకులు తాజాగా చేస్తున్న బోడి కొండ రాజకీయాలను ఆ రాముడు చూడకుండా ఉంటాడా.

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు