మహేష్ సినిమా 10 నుంచి?

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూట్ ఈ నెల మొదటి వారం నుంచి స్టార్ట్ కావాల్సి వుంది. దానికి పకడ్బందీ షెడ్యూలు ప్లానింగ్ జరుగుతోంది. ఒకసారి స్టార్ట్ అయితే మళ్లీ అక్టోబర్ ఎండ్ కు పూర్తి…

మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా షూట్ ఈ నెల మొదటి వారం నుంచి స్టార్ట్ కావాల్సి వుంది. దానికి పకడ్బందీ షెడ్యూలు ప్లానింగ్ జరుగుతోంది. ఒకసారి స్టార్ట్ అయితే మళ్లీ అక్టోబర్ ఎండ్ కు పూర్తి చేసేలా షెడ్యూలు వేస్తున్నారు. 

ఓ పాట మినహా టోటల్ సినిమా అక్టోబర్ ఎండ్ కు పూర్తి కావాలన్నది మహేష్ బాబు డెసిషన్. ఈ నెల 7 నుంచి షూట్ స్టార్ట్ చేయాలన్నది యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది. కానీ ఆ మధ్య అనుకున్న షెడ్యూలు లు ఏవీ జరగలేదు. దాంతో ముందుగా తీసుకున్న కాల్ షీట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా కాల్ షీట్లు తీసుకోవాల్సి వుంది.

ఎవరిని పడితే వారిని తీసుకోలేరు. కాంబినేషన్లు కీలకం. దాంతో అవి సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ డేట్ ల దగ్గరే సమస్య అవుతోందని తెలుస్తోంది. ఇచ్చిన డేట్ లు వాడుకోలేదు. ఇప్పుడు ఆయనకు వేరే కమిట్ మెంట్ లు వున్నాయి. దాని మీద డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ప్రకాష్ రాజ్ కు మంచి అడ్వాన్స్ నే పంపారని, కానీ మళ్లీ మరి కొంత అడ్వాన్స్ అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ క్లియర్ చేసుకుని 7 నుంచి సెట్ మీదకు వెళ్లాలి. కాదంటే 10 నుంచి వుండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సమయంలో మహేష్ బాబు ఓ మొబైల్ యాడ్ కూడా చేస్తారని తెలుస్తోంది.