ఫేస్ బుక్ వాడనివ్వడం లేదని భర్తనే వదిలేసింది

చూస్తుంటే, ఈ కాలం యువత పెళ్లిళ్లను చాలా లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. భర్త తనతో గొడవ పడడం లేదని, వాదించడం లేదని, బోర్ కొట్టి విడాకులిచ్చేసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ. అప్పట్లో…

చూస్తుంటే, ఈ కాలం యువత పెళ్లిళ్లను చాలా లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. భర్త తనతో గొడవ పడడం లేదని, వాదించడం లేదని, బోర్ కొట్టి విడాకులిచ్చేసింది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ. అప్పట్లో ఆ ఉదంతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకంటే వింత ఈ ఘటన. ఇది బిహార్ లో జరిగింది.

బిహార్ లోని హజీపూర్ కు చెందిన సబా ఖాతూన్, ఇలియాస్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లి జరిగి జస్ట్ 15 రోజులు మాత్రమే అవుతోంది. అంతలోనే వాళ్ల పెళ్లి పెటాకులైంది. దీనికి కారణం ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్.

పెళ్లయి అత్తవారింట్లో అడుగుపెట్టిన సబా, నిత్యం ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్ లోనే ఉంటోందట. దీనిపి ఇలియాస్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలియాస్ కూడా తన తల్లిదండ్రులతో వంతపాడాడు.

దీంతో గొడవ పెద్దదైంది. సీన్ లోకి సబా సోదరుడు వచ్చాడు. ఏకంగా ఇలియాస్ పై తుపాకీ గురిపెట్టాడు. పరిస్థితి చేయిదాటడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్ లేకుండా తను ఉండలేనని సబా, పోలీసులకు క్లియర్ గా చెప్పేసింది. అవసరమైతే తన భర్తను వదిలేయడానికి కూడా సిద్ధమని తెలిపింది.

అలా చెప్పడమే కాదు, ఆ వెంటనే భర్తను వదిలేసింది సబా. మరోవైపు సబా తల్లి ఆరోపణ మరోలా ఉంది. తమతో మాట్లాడనీయకుండా ఇలియాస్ తల్లిదండ్రలు, సబా నుంచి సెల్ ఫోన్ తీసుకుంటున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.

ఏదేమైనా ఫేస్ బుక్, ఇనస్టాగ్రామే తనకు ముఖ్యమంటూ భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది సబా. ప్రస్తుతం హజీపూర్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. భార్యభర్తకు కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు, తుపాకి గురిపెట్టిన సబా సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు.