తేజ మాత్రమే కాదు.. ఆర్పీ పట్నాయక్ కూడా..!

అహింస సినిమా మొత్తం 'గిల్ట్' చుట్టూ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. కేవలం రామానాయుడి కోసం అహింస సినిమా చేశానని, రామానాయుడు ఉన్నప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఆ గిల్ట్ ఫీలింగ్ అలా ఉండిపోయిందని, అందుకే…

అహింస సినిమా మొత్తం 'గిల్ట్' చుట్టూ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. కేవలం రామానాయుడి కోసం అహింస సినిమా చేశానని, రామానాయుడు ఉన్నప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఆ గిల్ట్ ఫీలింగ్ అలా ఉండిపోయిందని, అందుకే అభిరామ్ తో అహింస సినిమా చేశానని దర్శకుడు తేజ ఇప్పటికే ప్రకటించుకున్నాడు.

ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ వంతు వచ్చింది. ఆయన కూడా ఇదే ఫీలింగ్ తో అహింస సినిమాకు మ్యూజిక్ అందించాడట. ఆయన గిల్ట్ ఫీలయింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో.

ఎప్పుడు కనిపించినా ఆర్పీ పట్నాయక్ ను ఒకే విషయం అడిగేవారంట ఎస్పీబీ. మళ్లీ ఎప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నావంటూ ప్రశ్నించేవారట. ఇదిగో ఇప్పుడు, అప్పుడు అంటూ తప్పించుకుంటూ వచ్చారట ఆర్పీ పట్నాయక్.

అయితే బాలు ఈ లోకాన్ని వీడి వెళ్లిన తర్వాత, ఆయనకు ఇచ్చిన మాటను నెరవేర్చలేకపోయానని గిల్ట్ ఎక్కువైపోయిందట. ఆ బాధతోనే దర్శకుడు తేజను కలిసి మళ్లీ మ్యూజిక్ చేస్తానని చెప్పడం, తేజ అహింస ఆఫర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయంట.

అలా ఎస్పీబీ కోరిక నెరవేర్చడం కోసం అహింస సినిమాకు సంగీతం అందించానంటున్నారు ఆర్పీ పట్నాయక్. ఈ గ్యాప్ లో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ, కథ నచ్చక మ్యూజిక్ చేయలేదని స్పష్టం చేశాడు ఈ సంగీత దర్శకుడు.

మొత్తానికి అటు రామానాయుడు వల్ల, ఇటు ఎస్పీ బాలసుబ్రమణ్యం వల్ల తేజ-ఆర్పీ పట్నాయక్ మరోసారి కలిశారు. అహింస సినిమా చేశారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిజల్ట్ బయటకు రాబోతోంది.