ఏపీలో ఇదేమి అరాచకం బాబోయ్

ఒకప్పుడు బీహార్ రాష్ట్రాన్ని అరాచకాలకు నిలయంగా చెప్పుకునేవారు. రౌడీయిజానికి ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ స్థానంలోకి వచ్చి చేరింది.  Advertisement ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ అనేవారు.…

ఒకప్పుడు బీహార్ రాష్ట్రాన్ని అరాచకాలకు నిలయంగా చెప్పుకునేవారు. రౌడీయిజానికి ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ స్థానంలోకి వచ్చి చేరింది. 

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ అనేవారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే దేవతా విగ్రహాల విధ్వంసం గుర్తుకు వస్తోంది. దేశంలో ప్రతిరోజూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్  మాత్రమే. 

సాధారణంగా తాలిబన్లు పురాతన విగ్రహాలను ధ్వంసం చేస్తుంటారు . గతంలో ఒకసారి ప్రపంచంలోనే అతి పురాతనమైన, పెద్దదైన, కొండల్లో నిర్మించిన బౌద్ధ విగ్రహాన్ని పేల్చేశారు. ఆనాడు ఈ దారుణాన్ని ప్రపంచమంతా నిరసించింది. 

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే తాలిబన్లే గుర్తుకొస్తున్నారు. రామతీర్థం రగడ ఇంకా ముగియకముందే మరో విగ్రహం ధ్వంసమైంది. అయితే ఇది హిందూ దేవతా విగ్రహం కాదు. బుద్ధుడి విగ్రహం. 

రామతీర్థం ఘటనతో రాజకీయ పార్టీలతో రణరంగంగా మారింది. విగ్రహాల ధ్వంసంతో అధికార, విపక్షాల మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. ప్రభుత్వం, పోలీసులు దీనిపై అప్రమత్తమైనప్పటికీ… ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 

తాజాగా శ్రీకాకుళం టెక్కలిలో బుద్దుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ధ్వంసం చేశారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పక్కనున్న ఉద్యానవనంలో ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్దుని విగ్రహం ఉంది. 

ఈ విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల రోజుల క్రితం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీన్ని  గుర్తించిన అధికారులు శిల్పిని రప్పించి  కొత్త చేతిని అమర్చారు. అయితే.. ఆదివారం రాత్రి బుద్దుని చేయిని ఎవరో మళ్లీ విరగ్గొట్టారు.

ఈ పని చేసింది వైసీపీ వాళ్ళా, టీడీపీ వాళ్ళా తెలియదు. ఎవరో  ఆకతాయిలు కావాలనే చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. రామతీర్థం ఘటన తరువాత దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని సీఎం జగన్, హోమ్ మంత్రి సుచరిత ప్రకటించారు. 

అరాచకవాదులను పట్టుకొని శిక్షించడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఈ అరాచకాలు చేస్తోంది వైసీపీ వాళ్ళే అయితే పోలీసులు స్వేచ్ఛగా వ్యవహరించగలరా? 

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు