రాజ‌మౌళి సినిమాలో బాలయ్య?

టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ గ్యాసిప్ ఏదన్నా వుందీ అంటే అది ఇదే. మహేష్ బాబు-రాజ‌మౌళి కలిసి చేయబోయే సినిమాలో సీనియర్ హీరో బాలకృష్ణ ఓ ప్రధాన పాత్ర చేయబోతున్నారని.  Advertisement ఈ పాత్ర…

టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ గ్యాసిప్ ఏదన్నా వుందీ అంటే అది ఇదే. మహేష్ బాబు-రాజ‌మౌళి కలిసి చేయబోయే సినిమాలో సీనియర్ హీరో బాలకృష్ణ ఓ ప్రధాన పాత్ర చేయబోతున్నారని. 

ఈ పాత్ర సినిమా థ్రూ అవుట్ వుంటుంది కానీ మొత్తం మీద 40 నిమిషాల వరకు వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరు హీరోలకు రాజ‌మౌళి సూచన ప్రాయంగా చెప్పేసారని తెలుస్తోంది.

ఈ వార్త ఎంత వరకు నిజ‌మో అన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ గ్రూప్ ల్లో, ఇండస్ట్రీలో బాగానే తిరుగుతోంది. కానీ ఇదే నిజ‌మైతే మళ్లీ రాజ‌మౌళి సినిమా మల్టీ స్టారర్ గా మారిపోతుంది. 

ఆర్ఆర్ఆర్ మాదిరిగానే భారీ మల్టీ స్టారర్ అయిపోతుంది. బాలయ్య నే రాజ‌మౌళి సినిమాలో వున్నారు అంటే ఆ సినిమా మీద హడావుడి మామూలుగా వుండదు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హడావుడి నెలకొంది. అది పూర్తయిన కొన్నాళ్ల తరువాత ఈ వార్త నిజ‌మా కాదా అన్నది క్లారిటీ వస్తుంది.