నిర్మాణరంగంలోకి లహరి

అడియో రంగంలో స్థిరంగా వున్న లహరి మ్యూజిక్ సంస్థ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. వీనస్ ఎంటర్ టైనర్స్ తో కలిసి సినిమా నిర్మాణం చేపడుతున్నారు.  Advertisement ఈ రెండు సంస్థలు కలిసి ప్రముఖ…

అడియో రంగంలో స్థిరంగా వున్న లహరి మ్యూజిక్ సంస్థ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. వీనస్ ఎంటర్ టైనర్స్ తో కలిసి సినిమా నిర్మాణం చేపడుతున్నారు. 

ఈ రెండు సంస్థలు కలిసి ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్రతో కలిసి సినిమా నిర్మించబోతున్నారు. కాస్త భారీ బడ్జెట్ తో అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో సినిమా నిర్మాణం చేయబోతున్నారు.

ఈ సందర్భంగా లహరి సంస్థ చైర్మన్ మనోహరన్ మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో వున్నామని, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. ఉపేంద్రతో కలిసి వెంచర్ చేయడం సంతోషంగా వుందన్నారు.

వీనస్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత శ్రీకాంత్ మాట్లాడుతూ కన్నడంలో పలు విజ‌యవంతమైన సినిమాలు నిర్మించామని, ఇప్పుడు లహరితో కలిసి ఉపేంద్ర కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. 

నటుడు, దర్శకుడు ఉపేంద్ర మాట్లాడుతూ అభిమానులు, ప్రజ‌ల మనోభీష్టం మేరకే కథలు రాసి సినిమాలు తీస్తున్నా అని, ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రీతిలో వుంటుందని అన్నారు.