ఎవరేమనుకున్నా.. ఇంటాబయట విమర్శలొచ్చినా.. లెక్క చేయనట్టుగా కాపురం అయితే చేసుకుంటూ ఉన్నారు. సహజీవనమో ఇంకోటో.. వీరు గట్టిగానే నిలబడుతున్నారు. సినిమా వాళ్లు, అందునా ఇలాంటి వయసు వ్యత్యాసం ఉన్న వారి బంధం ఇన్నాళ్లు కొనసాగడమూ ఆశ్చర్యమే! అర్జున్ కపూర్ కన్నా మలైకా చాలా చాలా పెద్దది. అంతేగాక ఆమెకు చాలా యేళ్ల కిందట పెళ్లైంది. పిల్లలూ ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చి మరీ తన కన్నా వయసులో చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకుంది.
ఇద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఈ విషయంలో కుటుంబీకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. మలైక కు ఆమె మాజీ భర్తతో విడాకులకు ముందే ఇతడితో ఎఫైర్ ఉందనే టాక్ కూడా ఉండనే ఉంది. ఆ దశలో సల్మాన్ ఖాన్ కూడా వీరిని ఆపడానికి ప్రయత్నించాడని, అర్జున్ తండ్రితో తనకున్న పరిచయం ద్వారా కూడా ఒత్తిడి తీసుకు వచ్చాడని, అయితే అర్జున్ కపూర్ ఎవరినీ లెక్క చేయలేదని స్పష్టత వచ్చింది వాళ్లకు కూడా!
మరి వీరి సుదీర్ఘ బంధం పట్ల ఇప్పుడు ఎవరికీ అభ్యంతరాలు కూడా ఉన్నట్టుగా లేవు. ఎంచక్కా జంటగా ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తూ ఉన్నారు. తమ యథేచ్ఛగా జీవిస్తున్నారు. మంచిదే. అయితే సోషల్ మీడియాలో వీరి రచ్చ మళ్లీ వీళ్లను వార్తల్లోకి లాగుతోంది. ఇటీవల అర్జున్ కపూర్ నగ్నంగా .. మీద ఒక దిండు ను తుండులా అడ్డు పెట్టుకుని కూర్చున్న ఫొటోను మలైకా షేర్ చేసింది. అతడు లేజీ అంటూ ఏదో చెప్పడానికి ఆమె ఆ పోస్టు పెట్టింది. అయితే అది సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉంది!
వారు అలా ఫొటోలు తీసుకోవాలనుకుంటే, లేదా అలా ఇంట్లో నగ్నంగా తచ్చడాలనే నియమం పెట్టుకుని ఉంటే ఎవరికీ నష్టం లేదు. అయితే అదేదో ఘనకార్యం అయినట్టుగా అతడి ఫొటోలను ఆమె పోస్టు చేయడంతో మీరేంటి.. మీ కథేంటి.. అంటూ నెటిజన్లు విరుచుకుపడుతూ ఉన్నారు.
సామాజిక కట్టుబాట్లకూ, నియమాలకూ విరుద్ధంగా హ్యాపీగా బతుకుతున్నారు. మరి అలాంటప్పుడు మళ్లీ ఈ రచ్చ ఎందుకో.. వీరు విడిపోతున్నారని రూమర్లు వచ్చినప్పుడు వీరు తీవ్రంగా స్పందించారు. తమ గురించి అసత్యాలు అంటూ విరుచుకుపడ్డారు. తమ బంధం దృడమన్నారు. మరి మళ్లీ ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు.. ఇలాంటి ఫొటోలతో ఎవరి అటెన్షన్ ను పొందడానికో!