పవన్ ‘పవర్’ పోలీస్ కాదు

హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా అన్నప్పటి నుంచీ మళ్లీ మరో గబ్బర్ సింగ్ లాంటి పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపించడం ప్రారంభమైంది.  అయితే ఇప్పుడు క్లారిటీ…

హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా అన్నప్పటి నుంచీ మళ్లీ మరో గబ్బర్ సింగ్ లాంటి పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అన్న టాక్ వినిపించడం ప్రారంభమైంది.  అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. 

హరీష్ శంకర్ సినిమాలో హీరో క్యారెక్టర్ పోలీస్ కాదట. మరో తరహా పవర్ ఫుల్ క్యారెక్టర్ ను హరీష్ శంకర్ తయారుచేసినట్లు, దానికి పవన్ ఓకె చేసినట్లు తెలుస్తోంది.

వకీల్ సాబ్ లో లాయర్ గా, క్రిష్ సినిమాలో రాబిన్ హుడ్ స్టయిల్ క్యారెక్టర్, అయ్యప్పన్ రీమేక్ లో పోలీస్ గా పవన్ కనిపిస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో సెట్ అయ్యేలా, రిపీట్ కాకుండా వుండేలా హరీష్ శంకర్ మరో క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

సమ్మ‌ర్ తరువాత నుంచి ఈ సినిమా మీదకు వస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు బోగట్టా. నిన్నటికి నిన్న మైత్రీ రవి, డైరక్టర్ హరీష్ వెళ్లి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపినపుడు ఈ మేరకు పవన్ ఓ మాట అన్నట్ల బోగట్టా.

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు

సంక్షేమ నామ సంవ‌త్స‌రం!