చరణ్..ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశేనా?

ఇద్దరు టాప్ లీగ్ హీరోలను కలిపి, వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీయడం దర్శకుడు రాజ‌మౌళికి కష్టం కాలేదు. కానీ ఆ సినిమాకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం మాత్రం…

ఇద్దరు టాప్ లీగ్ హీరోలను కలిపి, వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీయడం దర్శకుడు రాజ‌మౌళికి కష్టం కాలేదు. కానీ ఆ సినిమాకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం మాత్రం కష్టం అయిపోయింది. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమాకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేయడం లేదని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ చేయాలంటే కనీసం లక్షమంది పట్టే వెన్యూ కావాలని అంచనా. ఎందుకంటే ఇద్దరు టాప్ లీగ్ హీరోల ఫ్యాన్స్ వెల్లువలగా వస్తారు. 

అందులోనో మిగిలిన తారాగణం కూడా వస్తే చెప్పనక్కరలేదు. పైగా ఆ సినిమా మీద వున్న అంచనాలు బజ్ అలాంటివి. అందువల్ల ఎక్కడ చేయాలనా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు సమానంగా అవకాశం ఇవ్వాలి. సమానంగా పాస్ లు ఇవ్వాలి.

ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కోసం వేలల్లో పాస్ లు అవసరం పడతాయని లెక్కలు కట్టారు. ఇవన్నీ చూసుకుంటే అంత పెద్ద సంఖ్యలో వచ్చే ఫ్యాన్స్ ను కంట్రొలు చేయాలంటే చాలా పోలీస్ బలగం కావాలి. అందుకే అవన్నీ ఆలోచించి, హైదరాబాద్ లో ఈవెంట్ చేసే ఆలోచనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.