ఇప్పటివరకు ఒక రూలు.. రేపట్నుంచి మరో రూలు

మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నాం. కొత్త ఏడాదితో పాటు కొన్ని కొత్త నిబంధనలు కూడా రాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకోవడం అత్యవసరం.  Advertisement ఎందుకంటే, సమాజంలో దాదాపు ప్రతి ఒక్కరికి వీటిలో ఏదో…

మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్నాం. కొత్త ఏడాదితో పాటు కొన్ని కొత్త నిబంధనలు కూడా రాబోతున్నాయి. వాటి గురించి తెలుసుకోవడం అత్యవసరం. 

ఎందుకంటే, సమాజంలో దాదాపు ప్రతి ఒక్కరికి వీటిలో ఏదో ఒకటి అప్లై అవుతుంది కాబట్టి.  

1. వాట్సాప్ ఆ ఫోన్లలో పనిచేయదు

రేపట్నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐవోఎస్-8 కంటే తక్కువ వెర్షన్ ఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ లో 4.0.3 వెర్షన్ కంటే తక్కువ వెర్షన్లు వాడే ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. 

ఉదాహరణకు హెచ్టీసీ, ఎల్జీ, మోటారోలో, శాంసంగ్ కంపెనీల్లో కొన్ని ఫోన్లు ఇంకా పాత వెర్షన్లతోనే నడుస్తున్నట్టు వాట్సాప్ గుర్తించింది. కొంతమంది యూజర్లు తమ ఫోన్లలో కొత్త వెర్షన్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవడం లేదు. ఇలా అప్ డేట్ చేసుకోని యూజర్లకు రేపట్నుంచి వాట్సాప్ పనిచేయదు.

2. ధర్డ్ పార్టీ పేమెంట్స్ పై చార్జీలు

ఇన్నాళ్లూ గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ను ఉచితంగా వాడుకున్నాం. పైపెచ్చు వాటి నుంచి రివార్డుల రూపంలో కొంత మొత్తాన్ని వెనక్కి పొందాం కూడా. కానీ రేపట్నుంచి ఇవి ఉచితం కాదు. 

మనీ ట్రాన్సఫర్ కు సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ రేపట్నుంచి ఛార్జీలు వసూలు చేయబోతున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI.. ఈ థర్డ్ పార్టీ యాప్స్ పై 30శాతం క్యాప్ విధించింది. 

కాబట్టి ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ అన్నీ ఛార్జీలు విధించడానికి సిద్ధమౌతున్నాయి. అయితే తక్షణం ఇలా చేస్తే వినియోగదారులు తమ యాప్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అందుకే గూగుల్ పే, అమెజాన్ పే సంస్థలు దీనిపై ఆలోచిస్తున్నాయి. కానీ ఎప్పటికైనా మోత తప్పకపోవచ్చు.

3. చెక్ పేమెంట్స్

మొన్నటివరకు బ్యాంక్ లో చెక్ ఇస్తే, 2-3 రోజుల్లో అది క్రెడిట్ అయిపోయేది. కానీ ఇకపై చెక్ పేమెంట్స్ కు రీ-కన్ఫర్మేషన్ తప్పనిసరి. మీరు 50వేల రూపాయలకు పైన చెక్ ఇస్తే.. దాన్ని క్లియర్ చేసేందుకు బ్యాంక్ మీకు సమాచారం అందిస్తుంది. లేదా ఫోన్ చేస్తుంది. మీరు ఓకే చెప్పిన తర్వాతే క్లియర్ అవుతుంది. లేకపోతే అవ్వదు. సో.. బ్యాంక్ అకౌంట్ కు సరైన ఫోన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి అన్నమాట. 

చాలామంది ఖాతాదారులు ఇప్పటికీ తమ ఫోన్ నంబర్ ను ఎకౌంట్ తో అనుసంధానం చేసుకోలేదు. అలాంటివాళ్లకు ఇది కాస్త ఇబ్బందిపెట్టే అంశమే. అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే తక్షణం తమ ఫోన్ నంబర్ ను బ్యాంక్ లో అప్ డేట్ చేసుకోవాలి. ఏటీఎంలలో కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

4. బైకులు-కార్లు ధరలు

రేపట్నుంచి కొన్ని కంపెనీల బైకులు, కార్ల ధరలు పెరగనున్నాయి. రేపట్నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట్టు ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు ప్రకటించాయి. 

ఇన్ పుట్ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం అనివార్యమైందని అవి తెలిపాయి. టూ-వీలర్ కంపెనీలది కూడా ఇదే దారి. కాకపోతే ఒక్కో కంపెనీ.. ఒక్కో తేదీని డెడ్ లైన్ గా ఫిక్స్ చేసుకుంది.

5. ఫాస్టాగ్

ఇకపై టోల్ గేట్ వద్ద డబ్బులిస్తే కుదరదు. రేపట్నుంచి 4-వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ఉండాల్సిందే. ఇప్పటికే చాలామంది తమ వాహనాలకు ఫాస్టాగ్ పెట్టుకున్నారు. 

ఇప్పటికీ పెట్టించుకోని వాళ్లకు రేపట్నుంచి టోల్ గేట్స్ వద్ద చుక్కలే. ఇప్పటికే కేంద్రం పలుమార్లు ఫాస్టాగ్ గడువును పెంచింది. ఈసారి పెంచడం లేదు.

6. ప్రతి కంపెనీలో కామన్ పాలసీ

జీవిత బీమా తీసుకోవాలంటే ఒక్కో కంపెనీది ఒక్కో ఎత్తుగట. రకరకాల పేర్లు, రకరకాల ఆఫర్లు. షాపింగ్ మాల్స్ లో కూడా ఇన్ని రకాల ఆఫర్లు ఉండవేమో అనిపిస్తుంది. ఏ కంపెనీ బీమా తీసుకోవాలనే సందేహం సగటు మనిషిలో ఎప్పుడూ ఉంటుంది. దీనికి ఓ పరిష్కారం వచ్చింది. 

ఐఆర్డీఏ కొత్త బీమా పాలసీ ప్రకటించింది. దీని పేరు సరల్ జీవన్ బీమా. ఇకపై ఏ బీమా కంపెనీకి వెళ్లినా ఈ పాలసీ, ఇదే పేరుతో ఉంటుంది. ఇందులో నియమాలు-నిబంధనలు మార్చడానికి ఏ కంపెనీకి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. కాకపోత్ క్లెయిమ్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. ప్రతి కంపెనీ ఈ పాలసీని అమలుచేయాల్సిందే.

7.మ్యూచువల్ ఫండ్స్ లో కొత్త మార్పులు

మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో కొత్త రూలు వచ్చింది. అస్సెట్ అలొకేషన్ ను సెబీ మార్చింది.

ఇకపై 65శాతం కాకుండా.. ఇకపై 75శాతం మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. దీని వల్ల కంపెనీలపై, తద్వారా ఫండ్ తీసుకునే వ్యక్తిపై రిస్క్ భారం కాస్త పెరుగుతుంది. అయితే దీనికి విరుగుడుగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది.

8. టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్

వీటితో పాటు టీవీలు, వాషింగ్ మెషీన్ల ధరలు కూడా పెరగబోతున్నాయి. టీవీల్లో ఓపెన్ సెల్ దిగుమతిపై సుంకం పెరగడం, వాషింగ్ మెషీన్లు-రిఫ్రిజిరేటర్లలో కూడా కొన్ని విడి భాగాలపై సుంకం పెరగడంతో, కొన్ని కంపెనీలకు చెందిన అత్పత్తుల ధరలు 10శాతం వరకు పెరగనున్నాయి.  

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క