ఎన్టీఆర్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడు

ఈ మాట మేం అంటోంది కాదు, తారక్ బెస్ట్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల అంటున్నాడు. తారక్ కు పాలిటిక్స్ పై చాలా ఆసక్తి ఉందని, ఏదో ఒక టైమ్ లో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని…

ఈ మాట మేం అంటోంది కాదు, తారక్ బెస్ట్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల అంటున్నాడు. తారక్ కు పాలిటిక్స్ పై చాలా ఆసక్తి ఉందని, ఏదో ఒక టైమ్ లో కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నాడు. కాకపోతే అది ఇప్పట్లో కాదని కూడా స్పష్టం చేస్తున్నాడు.

“రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే ఎన్టీఆర్ స్వయంగా చెబుతాడు. అదేదో సడెన్ గా కూడా కాదు, పక్కా ప్లానింగ్ తో చెబుతాడు. అతడికి రాజకీయ వారసత్వం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ప్రచారం చేశాడు. చక్కగా మాట్లాడాడు. లక్షల మంది ఎదుట తారక్ మాట్లాడితే, అంతా ఉర్రూతలూగారు. అందరూ సమ్మోహనం అయిపోయారు. సో.. రాజకీయాలంటే ఆసక్తి లేకపోవడం అనేది ఉండదు. కచ్చితంగా తారక్ కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఉండకపోవచ్చు. ఇంకో ఐదేళ్ల తర్వాత ఉండొచ్చు.”

ప్రస్తుతం ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాపైనే తారక్ ఫోకస్ మొత్తం ఉందంటున్నాడు కనకాల. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై తారక్ మౌనంగా ఉన్న అంశంపై కూడా రాజీవ్ స్పందించాడు. ఆ విషయం తనకు తెలియదని, తారక్ తనతో ఏం చెప్పలేదని అంటున్నాడు.

“నాకు ఆ సంగతి ఐడియా లేదు. అందరూ నిజంగానే నెగెటివ్ గా ఫీల్ అవుతున్నారా.. లేక కొంతమంది అదే పనిగా కూర్చొని నెగెటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా అనే విషయం నాకు అర్థంకావడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడనేది కూడా నాకు తెలీదు. చంద్రబాబు అరెస్ట్ పై తారక్, కల్యాణ్ రామ్ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. కాబట్టి నేను స్పందించడం కరెక్ట్ కాదు. ఈమధ్య కాలంలో నేను తారక్ ను కలవలేదు. ఏదైనా ఉంటే నాకు చెబుతాడు, కానీ ఈ విషయంపై మేం మాట్లాడుకోలేదు, నాకు తెలీదు.”

ఆర్ఆర్ఆర్ కు ముందు, ఆ సినిమా షూటింగ్ టైమ్ లో తారక్ 3-4 సినిమాలు చేయాల్సి ఉందని, కానీ షెడ్యూల్స్ అన్నీ లేట్ అయ్యాయని, అదే టైమ్ లో దేవర సినిమాకు కూడా చాలా టైమ్ పడుతోందని, కాబట్టి ఎన్టీఆర్ ఫోకస్ మొత్తం ప్రస్తుతానికి సినిమాలపైనే ఉందని స్పష్టం చేశాడు రాజీవ్ కనకాల.

పైగా తారక్ కు ఇంకా చాలా వయసు ఉందని, రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని, ఏదో ఒక టైమ్ లో స్పష్టంగా ప్రకటన చేసి మరీ తారక్ రాజకీయాల్లోకి వస్తాడని నమ్మకంగా చెబుతున్నాడు రాజీవ్ కనకాల. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే తారక్, వ్యూహాత్మకంగా చంద్రబాబు అరెస్ట్ పై మౌనం పాటించాడేమో అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. తనకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని, సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నాడు.