టాలీవుడ్ లో విభిన్నమైన పరిస్థితి నెలకొంది. ఓ పక్కన చకచకా సినిమాలు సెట్ మీదకు వస్తున్నాయి. అదే టైమ్ లో చాలా సినిమాలు ఫైనాన్స్ లు అందక కిందా మీదా అవుతున్నాయి.
ఓ సీనియర్ హీరోతో ఓ పెద్ద డైరక్టర్ తీస్తున్న సినిమా ఒకటి వుంది. ఈ సినిమాకు చాలా బాలారిష్టాలు వున్నాయి. కానీ ఏదో విధంగా ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ జనాలకు సకాలంలో పెమెంట్లు అందడం లేదని, దాంతో కాస్త కిందా మీదా అవుతోందని టాక్ వినిపిస్తోంది.
సీనియర్ పెద్ద హీరో సినిమా కాబట్టి కాస్త గట్టిగా అడగలేరు. కానీ కొన్ని క్రాఫ్ట్స్ జనాలు మాత్రం పేమెంట్ల కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అసలే మార్కెట్ ఎలా వుంటుందో తెలియదు. కాస్త భారీ బడ్జెట్ తో కూడిన సినిమా.
సకాలంలో రెడీ చేసి, సమ్మర్ కు తీసుకురాకపోతే సమస్య అవుతుంది. అలాంటి నేపథ్యంలో ఇలాంటి గ్యాసిప్ లు వినిపిస్తూ వుండడం కాస్త ఆశ్చర్యంగానే వుంది.
సినిమాలు ఎక్కువగా ఫైనాన్స్ మీద ఆధారపడి చేయాల్సి రావడం, ప్రస్తుతం ఫైనాన్సియర్లు కౌంటర్లు క్లోజ్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చి వుంటుందని టాక్ వినిపిస్తోంది.