తమిళ నటి కోవై సరళ తెలుగు చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. కోవై సరళ తెరపై కనిపించగానే ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరు. అలాంటి కోవై సరళను మన నారా లోకేశ్ మరిపిస్తున్నారనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే నారా లోకేశ్ రాజకీయ తెరపై హాస్యాన్ని పండిస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర, ఆయనలోని హాస్య చతురతను, నటుడిని బయట పెట్టిందని సెటైర్స్ విసురుతున్నారు. అన్నీ మేనమామ బాలయ్య బుద్ధులొచ్చాయని ముద్దుగా అంటున్నారు.
లోకేశ్ ప్రసంగంలోని హాస్య ఆణిముత్యాలంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టడం విశేషం. లోకేశ్ మాటల్లో దొర్లిన తప్పులను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఒరిజినల్‌గా ఏముండాలి, వాటిని లోకేశ్ ఎలా పలుకుతున్నారో సోషల్ మీడియాలో ఓ పట్టీని వేస్తూ వైరల్ చేయడం విశేషం. ఆ వివరాలేంటో చూద్దాం.
లోకేశ్ పలికింది ఒరిజినల్ పదం
ఆలుగడ్డ – ఆళ్లగడ్డ
భూమా కుటుంబ సబ్బులు – భూమా కుటుంబ సభ్యులు
గొంగల నాని – గంగుల నాని
ముందల – ముందర
డెబ్బి – డెబ్బై
ముప్పి – ముప్ఫై
పోతిరెడ్డిపాటు – పోతిరెడ్డిపాడు
పాత సినిమాల్లో కోవై సరళ హాస్యం కోసం చెప్పే డైలాగ్స్‌ను లోకేశ్ ప్రసంగ వీడియోలను తెరపైకి తెచ్చి వినోదాన్ని పంచుతున్నారు. తప్పి పోయి లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారని, సినిమాల్లో ట్రై చేసి వుంటే అద్భుతమైన కమెడియన్‌గా పేరు తెచ్చుకునే వారని సెటైర్స్ విసురుతున్నారు.