ఏప్రిల్ తో ఆర్ఆర్ఆర్ పూర్తి

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పటితో పూర్తవుతుంది? ఇదీ సినిమా అభిమానులు సదా అడిగే ప్రశ్న. ఎందుకంటే తమ తమ అభిమాన హీరోలు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఏళ్ల తరబడి ఆ ఒక్క సినిమా మీదా లాక్…

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పటితో పూర్తవుతుంది? ఇదీ సినిమా అభిమానులు సదా అడిగే ప్రశ్న. ఎందుకంటే తమ తమ అభిమాన హీరోలు ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఏళ్ల తరబడి ఆ ఒక్క సినిమా మీదా లాక్ అయిపోయారు.

ఆ సినిమా వాళ్ల కెరీర్ కు ఎంత హెల్ప్ చేస్తుందో అన్నది పక్కన పెడితే ఆ ఇద్దరు హీరోల తరువాత సినిమాలు ఓ టైమ్ షెడ్యూలు అన్నది లేకుండా ఆగిపోయాయి. 

ఆర్ఆర్ఆర్ యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ తరువాత ఇక ఆర్ఆర్ఆర్ షూట్ అన్నది వుండదు. అక్కడితో అది పూర్తయిపోతుంది. 

ఇద్దరు హీరోలను రాజమౌళి వదిలేస్తారు. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదకు వెళ్లిపోతారు. అప్పటి నుంచి హీరోలు ఒకరు తివిక్రమ్ సినిమా మీదకు, మరొకరు కొరటాల శివ సినిమాకు వెళ్లిపోతారు.

ఇదిలా వుంటే ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు రాజమౌళి ఆరు నెలలు టైం బౌండ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబర్ కు సినిమా విడుదల సుగమం అవుతుంది. 

వాస్తవానికి జూన్, జూలై ల్లో సినిమా విడుదల అన్నటాక్ వుంది. కానీ ఆ టైమ్ కు రెడీ కావడం కష్టం అని తెలుస్తోంది. ఎంతగా ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నా, ఆరు నెలల సమయం పక్కా పడుతుందని యూనిట్ వర్గాల సమాచారం.

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా