బిగ్‌బాస్ క్రేజీ జంట‌కు హోస్ట్‌గా ఆఫ‌ర్లు!

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-4లో ఒక‌టికి మించి జంట‌లున్నాయి. ఇందులో క‌మెడియ‌న్ అవినాష్‌, యూట్యూబ‌ర్ అరియానా జంట ఎంతో ప్ర‌త్యేకం. బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు, బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కూడా వీళ్ల‌ది క్రేజీ జంట‌గా…

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-4లో ఒక‌టికి మించి జంట‌లున్నాయి. ఇందులో క‌మెడియ‌న్ అవినాష్‌, యూట్యూబ‌ర్ అరియానా జంట ఎంతో ప్ర‌త్యేకం. బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు, బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత కూడా వీళ్ల‌ది క్రేజీ జంట‌గా పాపుల‌ర్ అవుతున్నారు. ఈ రియాల్టీ షోకు రాక‌మునుపు వీళ్ల‌ద్ద‌రి గురించి తెలిసింది త‌క్కువ‌. ఇప్పుడు అమాంతం వాళ్లిద్ద‌రి పాపులారిటీ పెరిగి సెల‌బ్రిటీ ల‌య్యారు.

తాజాగా అరియానా-అవినాష్ జోడీకి మంచి ఆఫర్లు వ‌స్తున్నట్టు స‌మాచారం. నెటిజ‌న్లు ముద్దుగా ఇద్ద‌రి పేర్ల‌ను క‌లిపి అవియానా అని పిలుచుకునే ఈ జంట కాంబినేష‌న్‌ను కొన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాన‌ళ్లు త‌మ ఉన్న‌తికి ఉప‌యోగించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా కొన్నిప్రోగ్రామ్స్ విష‌య‌మై వారితో స‌ద‌రు చాన‌ళ్ల ప్ర‌తినిధులు చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఇద్దరిని హోస్ట్‌గా పెట్టి స్పెషల్‌ ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తే చాన‌ళ్ల‌కు మంచి ఊపు వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నార‌ట‌. రాంగోపాల్‌వ‌ర్మ లాంటి విల‌క్ష‌ణ‌, వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిని ఇంట‌ర్వ్యూ చేసిన ఘ‌న‌త అరియానా ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. కావున హోస్ట్‌గా అరియానా మంచి వాగ్ధాటితో ఆక‌ట్టుకుంటుంద‌నడంలో సందేహం లేదు.

ఇక అవినాష్ విష‌యానికి వ‌స్తే గ‌తంలో శ్రీముఖితో క‌లిసి ఓ షోను హోస్ట్ చేసిన అనుభ‌వం ఉంది. అన్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్టు జ‌రిగితే మాత్రం ఈ క్రేజీ జంట సంద‌డిని మ‌రోసారి బుల్లితెర‌పై చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. అవినాష్ కామెడీ, అరియానా సీరియ‌స్లీ అంటూ అరిచే అరుపులు వినే, చూసే అవ‌కాశం వ‌స్తుంది.  

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా ?