ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన ‘సోలో’

కరోనా కేవలం షూటింగ్ లు ఆపేయడమే కాదు, నిర్మాతలను ఒక తరహా అయోమయానికి గురి చేసింది. మళ్లీ థియేటర్లు గతంలో మాదిరిగా కళకళలాడుతాయా? అన్న అనుమానాలు రేకెత్తించింది.  Advertisement థియేటర్లు గతంలో మాదిరిగా వుండకపోతే…

కరోనా కేవలం షూటింగ్ లు ఆపేయడమే కాదు, నిర్మాతలను ఒక తరహా అయోమయానికి గురి చేసింది. మళ్లీ థియేటర్లు గతంలో మాదిరిగా కళకళలాడుతాయా? అన్న అనుమానాలు రేకెత్తించింది. 

థియేటర్లు గతంలో మాదిరిగా వుండకపోతే ఇప్పటి వరకు వున్న మార్కెట్ ఈక్వేషన్లు మారిపోతాయి. ఆ లెక్కలు మారిపోతే, నిర్మాతల బడ్జెట్, లాభాలు తేడా వస్తాయి. అవి తేడా వస్తే రెమ్యూనిరేషన్లు మారిపోతాయి. ఇన్ని సమస్యలు వున్నాయి.

అందుకే థియేటర్లకు జనం రావాలి. అవి కళకళలాడాలి అని నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కోరుకున్నాయి. సోలో బతుకే సో బెటర్ సినిమాకు ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడింది. 

యువి వంశీ, దిల్ రాజు లాంటి వాళ్లు ముందుకు వచ్చి ఆ సినిమా థియేటర్ రైట్స్ 8 కోట్లకు జీటీవీ నుంచి కొని మరీ విడుదల చేసారు. తాము కొన్న రేటుకే దాన్ని ఏరియాల వారీ విక్రయించారు. 

సినిమా విడుదలయింది. సినిమా టాక్ విషయం పక్కన పెడితే తొలి రోజు, మలి రోజు కలెక్షన్లు బాగానే వున్నాయి. కొన్నిచోట్ల ఫ్యామిలీలు కూడా థియేటర్ లోకి ఎంటర్ అయ్యాయి. 

ఆంధ్ర కు నాలుగు కోట్లు రేషియోలో విక్రయించారు. ఫస్ట్ వీకెండ్ లోనే చాలా వరకు బ్రేక్ ఈవెన్ అయిపోతారు అని టాక్ వినిపిస్తోంది. వారం మొత్తం మీద, అలాగే మలివారం చూసుకుంటే కమిషన్లు కిట్టుబాటు అవుతాయని కూడా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇధి చూసి నిర్మాతలకు ధైర్యం వచ్చింది. ఎంత ధైర్యం వచ్చింది అంటే ఓటిటికి సినిమాల ఫస్ట్ కాపీ ఇచ్చేయాలనుకుంటున్న వారు ఇప్పడు పునరాలోచనలో పడ్డారు.

థియేటర్ కే ఇవ్వాలనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోపక్కన థియేటర్ల జనాలు కూడా హ్యాపీగానే వున్నారు. క్యాంటీన్, పార్కింగ్ ఇన్ కమ్ లు మళ్లీ మొదలయ్యాయి. జనం భయం లేకుండా సినిమాకు వస్తున్నారు.

మొత్తానికి కరోనా మిగిల్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది సోలో బతుకే సో బెటర్. ఎంతటి భరోసా అంటే వచ్చేవారం ఒకేసారి అయిదు సినిమాలు విడుదలయ్యేంత భరోసా. పండగ, ఆ తరువాత వారం, ఆపై వారం సినిమాలు ప్లాన్ చేసుకునేంత.

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా  ?