సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. Advertisement వయసురీత్యా వచ్చిన సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారు శరత్…

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

వయసురీత్యా వచ్చిన సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతున్నారు శరత్ బాబు. ఇందులో భాగంగా ఏప్రిల్ 20 నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఆయన మరణించారంటూ వచ్చిన వార్తల్ని, కుటుంబ సభ్యులు ఖండించారు. శరత్ బాబు ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు షిఫ్ట్ అయ్యారని కూడా ప్రకటించారు.

దీంతో శరత్ బాబు ఆరోగ్యం కుదుటపడిందని అంతా అనుకున్నారు. కానీ మరసారి ఆయన ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 220కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించారు.

శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో ఆయన చిత్రరంగ ప్రవేశం జరిగింది. 80ల్లో ఆయన కెరీర్ పీక్ స్టేజ్ లో సాగింది. అదే టైమ్ లో 3సార్లు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డ్ కూడా అందుకున్నారాయన.