రిపోర్టులన్నీ ఓకే.. ఈరోజే డిశ్చార్జ్?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పెండింగ్ లో ఉన్న రిపోర్టులు కూడా కొద్దిసేపటి కిందట వచ్చేశాయి. అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయి. దీంతో రజనీకాంత్ ఈరోజు హాస్పిటల్  నుంచి…

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పెండింగ్ లో ఉన్న రిపోర్టులు కూడా కొద్దిసేపటి కిందట వచ్చేశాయి. అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయి. దీంతో రజనీకాంత్ ఈరోజు హాస్పిటల్  నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి.

హైదరాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఆయన నేరుగా చెన్నైలోని తన ఇంటికి వెళ్తారు. ఆయన కోసం బేగంపేట్ లో ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రజనీకాంత్ చెన్నై బయల్దేరే అవకాశం ఉంది.

అన్నాత్తై షూటింగ్ కోసం 10 రోజుల కిందట హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. కొన్ని రోజుల పాటు షూటింగ్ బాగానే సాగింది. సెట్స్ లోకి నయనతార కూడా వచ్చిచేరింది. అయితే ఊహించని విధంగా యూనిట్ లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ ను ఉన్నఫలంగా ఆపేశారు.

ముందుజాగ్రత్త చర్యగా రజనీకాంత్ వెంటనే వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చినప్పటికీ, హై బీపీ కారణంగా 48 గంటల పాటు వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. దీంతో పాటు మరికొన్ని అదనపు పరీక్షలు కూడా చేశారు. రాత్రంతా బీపీ నిలకడగా ఉండడంతో పాటు, పరీక్షల ఫలితాలు కూడా నార్మల్ గా రావడంతో.. ఎలాంటి క్లినికల్ డౌట్స్ లేకపోతే సాయంత్రానికి రజనీకాంత్ డిశ్చార్జ్ అవుతారు.

తన నివాసానికి చేరుకున్న తర్వాత కనీసం వారం రోజుల పాటు రజనీకాంత్ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. మరో 4 రోజుల్లో చేయాల్సిన పొలిటికల్ పార్టీ ప్రకటనపై సస్పెన్స్ నెలకొంది. 

సోహైల్ సినిమాలో అరియానా హిరోయినా  ?