హీరోయిన్ అవికాగోర్ అనే పేరు కంటే, ఆమె నటించిన సినిమానే బాగా పాపులర్ అయ్యింది. `ఉయ్యాలా.. జంపాలా..` సినిమాతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తాజాగా తన మొదటి సినిమా హీరో పెట్టిన పోస్టుపై ఆమె కామెంట్ వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
అవికా గోర్ మొదట బుల్లితెర నటిగా బాగా గుర్తింపు పొందారు. 2008లో కలర్స్ టివిలో “బాలికా వధు” అనే హిందీ ధారావాహికలో నటించింది. ఇది తెలుగులో చిన్నారి పెళ్ళికూతురు టైటిల్‌తో ప్రసారమై తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది.
అనంతరం `ఉయ్యాలా.. జంపాలా..` సినిమాతో టాలీవుడ్‌కు ఆమె పరిచయమయ్యారు. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లగా నటించి మెప్పించారు. ఆ తర్వాత `సినిమా చూపిస్తా మామ` సినిమాలో కలిసి నటించి వరుస విజయాలను నమోదు చేసుకున్నారు.
తాజాగా రాజ్‌తరుణ్ తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. కరోనా నిబంధనల కారణంగా అత్యంత సన్నిహితులను మాత్రమే ఆయన ఆహ్వానించారు. అలా వచ్చిన వారిలో అవికా గోర్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా కొత్త ఇంట్లో తల్లిదండ్రులతో పాటు అవికతో కలిసి దిగిన ఫొటోను రాజ్‌తరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతటితో ఆయన ఆగకుండా చక్కటి కామెంట్ పెట్టాడు.
“నా మొదటి చిత్రం నుంచి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు అవిక” అని కామెంట్ చేశాడు. రాజ్‌తరుణ్ స్పందనపై అవిక ప్రతిస్పందించారు.
“నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రాజ్‌తరుణ్. నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నా” అని ఆమె కామెంట్ చేయడం టాలీవుడ్లో రకరకాల చర్చకు దారి తీసింది.
ఎప్పటికీ నీతోనే ఉంటా, నిన్ను ప్రేమిస్తున్నా అనే మాటలకు నెటిజన్లు తమకిష్టం వచ్చినట్టు భాష్యాలు చెబుతున్నారు. ఇంతకూ తన మాటలకు అసలుసిసలు అర్థం , పరమార్థం ఏమిటో అవికాగోర్ మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మనసు, మాటలు ఆమెవే కాబట్టి.