తమ్ముడు తమ్ముడే, వ్యాపారం వ్యాపారమే

ఒకే రోజు, ఒకే కాంపౌండ్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అవుతాయా? పోనీ తన కాంపౌండ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ప్రత్యర్థి సినిమాకు ఎవరైనా ప్రమోషన్ చేస్తారా? రానా మాత్రం చేస్తున్నాడు. Advertisement రానా…

ఒకే రోజు, ఒకే కాంపౌండ్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అవుతాయా? పోనీ తన కాంపౌండ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ప్రత్యర్థి సినిమాకు ఎవరైనా ప్రమోషన్ చేస్తారా? రానా మాత్రం చేస్తున్నాడు.

రానా తమ్ముడు అభిరామ్, అహింస అనే సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. జూన్ 2న థియేటర్లలోకి వస్తున్నాడు. అదే రోజు పరేషాన్ అనే మరో చిన్న సినిమా కూడా వస్తోంది. రానా మాత్రం అహింసను పక్కనపెట్టి, పరేషాన్ సినిమాకు ప్రచారం చేస్తున్నాడు.

పరేషాన్ మూవీకి సంబంధించి మీడియా ముందుకొచ్చాడు రానా. ఇదే అంశంపై రానాను ప్రశ్నించింది  గ్రేట్ ఆంధ్ర . దానికి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు ఈ దగ్గుబాటి హీరో.

“తమ్ముడి సినిమాతో పాటు మా పరేషాన్ కూడా వస్తోంది. మరో 2 సినిమాలు ఆరోజు వచ్చినా ఫర్వాలేదు. ఏ జానర్ దానిదే. ప్రతి హీరో సోలో రిలీజ్ కోసం చూడకూడదు. ఆ రోజులు పోయాయి. ఇప్పటి సినిమా పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో సోలో రిలీజ్ లేకపోయినా పర్వాలేదు. పైగా ఈ రెండు సినిమాల స్కేల్ కి ఇప్పుడున్న థియేటర్లు చాలా ఎక్కువ. ఇంకో 200 థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. కావాలంటే ఆ రోజున ఇంకో సినిమా కూడా రావచ్చు.”

తన తమ్ముడు హీరోగా పరిచయమౌతున్న అహింస సినిమాకు కూడా తను ప్రచారం చేస్తానంటున్నాడు రానా. అది కూడా తన సినిమానేనని అంటున్నాడు. కానీ ప్రస్తుతానికైతే పరేషాన్ సినిమా ప్రచారం మీదే ఉన్నట్టు స్పష్టం చేశాడు.

అహింస సినిమాను జెమినీ కిరణ్ నిర్మించారు. పరేషాన్ సినిమాను తను సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు రానా. దీనిపై ఆయన కొంత డబ్బులు పెట్టాడు. కాబట్టి పరేషాన్ సినిమా హిట్టవ్వడమే రానాకు అవసరం. తమ్ముడు తమ్ముడే, వ్యాపారం వ్యాపారమే.