జబర్దస్త్ కామెడీ: ఇద్దరూ ఇద్దరే

మాడిపోతారు, మసైపోతారు, ముక్కలైపోతారు.. మాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా.. జాగ్రత్త.. అంటూ కేఏపాల్, సీఎం జగన్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే.. సరిగ్గా అలాంటి వ్యాఖ్యలే చేసి నారా…

మాడిపోతారు, మసైపోతారు, ముక్కలైపోతారు.. మాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా.. జాగ్రత్త.. అంటూ కేఏపాల్, సీఎం జగన్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే.. సరిగ్గా అలాంటి వ్యాఖ్యలే చేసి నారా లోకేష్ వార్తల్లో వ్యక్తిగా మారారు. 

కరోనా కారణంగా విశాఖలో భారీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో పాల్ కి పట్టరాని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడేశారు.

మరీ పాల్ ని పట్టించుకోవడం ఎందుకని వదిలేశారు కానీ, లేకపోతే ఆయన వ్యాఖ్యలకు అరెస్ట్ చేసి జైలులో పెట్టాల్సిన పరిస్థితి. కాకపోతే వైసీపీ శ్రేణులు పాల్ ని కామెడీ పీస్ గా పరిగణించి వదిలేశాయి. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ కామెడీ చేస్తున్నారు లోకేష్.

తిరుమల  పవిత్రత దెబ్బతిన్నది అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. పోనీ నిజంగానే తిరుమలలో తప్పు జరిగింది అనుకుంటే.. దానిని సరిచేయాలని, వెంటనే సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి సలహా ఇవ్వొచ్చు. లేదా ప్రతి దానికి కోర్టు మెట్లెక్కడం అలవాటే కాబట్టి, టీటీడీపై కూడా అలాంటి పిటిషన్ ఒకటి వేసి తమాషా చూడొచ్చు. కానీ లోకేష్ నోరు జారారు, మాట మీరారు, మరీ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల పవిత్రత మంటగలుస్తోందని, లడ్డూ ప్రసాదం రేటు పెంచారని, డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ కొండపైకి వెళ్లారని, ముక్కోటికి భక్తుల్ని ఇబ్బంది పెడుతురన్నారని.. ఇలా రకరకాల కారణాలు ప్రస్తావిస్తూ కలియుగ దైవం ఆగ్రహానికి జగన్ గురికావాల్సి వస్తోందని శాపాలు పెట్టారు. “వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసు కదా జగన్ రెడ్డిగారు..” అంటూ తన అక్కసు వెళ్లగక్కారు.

అక్కడ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పాల్, ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని లోకేష్.. భలేగా మాట్లాడుతున్నారు. వీరిద్దరి లాజిక్ లను బట్టి చూస్తే ఒకరి మాట నిజమైతే ఇంకొకరి మాట అబద్ధం అవుతుంది. 

నిజంగానే విశాఖలో క్రిస్మస్ సభ జరక్కుండా జగన్ అడ్డుకున్నారని అనుకుంటే, ఆయన హిందూ మతానికి మద్దతుగా ఉన్నారనుకోవాలి. ఇక్కడ తిరుమల పవిత్రతను దెబ్బతీశారు అనుకుంటే జగన్ కు క్రైస్తవంపై నమ్మకం ఎక్కువ అని ఊహించాలి.

మరి ఈ రెండింటిలో ఏది నిజం. పాల్, లోకేష్ ఇద్దరూ అవకాశవాదులే అన్నది నిజం. మతాన్ని అడ్డు పెట్టుకుని ఫండ్స్ తెచ్చుకునే కార్యక్రమం కరోనా వల్ల ఆగిపోవడంతో ఆ అక్కసుని జగన్ పై వెళ్లగక్కారు పాల్. 

ఆకాశంపై ఉమ్మేశారు. అలాగైనా వార్తల్లో నిలవాలని చూశారు. ఇప్పుడు లోకేష్ చేసింది కూడా అదే. కలియుగ దైవం ఆగ్రహానికి జగన్ గురికావాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నారంటే, ఆయన మనసులో ఎంత కుట్ర, కుళ్లు పెట్టుకున్నారో అర్థమవుతోంది. మొత్తమ్మీద మరోసారి పాల్, లోకేష్ ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు.

బిగ్ బాస్ ఆ విషయం చూపించలేదు