డిజె టిల్లు సెటైర్లు..మామూలుగా కాదు

సినిమా ప్రమోషన్ ఇంటర్వూలు కామన్. కొన్ని కొన్ని ఇంటర్వూలు కాన్సెప్ట్ తో చేస్తారు. కొన్ని ఫన్ పండించేలా చేస్తారు. ఇలా చాలా రకాలు వుంటాయి. అన్నీ మంచి శకునములే సినిమాకు టిల్లు..సిద్దు జొన్నలగడ్డ ఓ…

సినిమా ప్రమోషన్ ఇంటర్వూలు కామన్. కొన్ని కొన్ని ఇంటర్వూలు కాన్సెప్ట్ తో చేస్తారు. కొన్ని ఫన్ పండించేలా చేస్తారు. ఇలా చాలా రకాలు వుంటాయి. అన్నీ మంచి శకునములే సినిమాకు టిల్లు..సిద్దు జొన్నలగడ్డ ఓ ఇంటర్వూ చేసారు. దాంట్లో దర్శకురాలు నందిని, హీరోయిన మాళవిక, హీరో సంతోష్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వూలో సిద్దు సెటైర్లు మామూలుగా లేవు. సినిమా విడుదలకు ముందు చేసిన ఈ ఇంటర్వూ, విడుదల తరువాత చూస్తే ఎక్కడో ఏదో కనెక్ట్ అయ్యేలా ప్రతి మాట అనిపిస్తుంది. ఓసారి ఇంటర్వూలోకి వెళ్లి సిద్దూ మాటలు చూస్తే…

-డైరక్టర్లు ఊరికే ఏదోదో చెబుతూ వుంటారు..మనకి అర్థం కావు.

-నువ్వు ఇది తీయవయ్యా ముందు..సీక్వెల్ తరువాత (సంతోష్ ను)

-స్మార్ట్ గా పెట్టారు టైటిల్. సినిమా బాగాలేదు అనకుండా. టైటిల్ మీద స్మార్ట్ వర్క్ చేసారు

-అదే అంకుల్..అదే ఆంటీ..అదే సొషల్ డ్రామా..ఫ్యామిలీ, లవ్, యూత్, సెంటిమెంట్, మాస్, కమర్షియల్…ఇంకెందుకు ఫాంటసీ కూడా చేసేయండి. (నందిని రెడ్డిని)

-మీరు కాలేజీ జాయిన అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి, అక్కడ చదవురాక, మొదలుపెడితే ఎక్కడిదాకానో పోతుంది.(మాళవిక ను)

-అసలు మీరు మూవీ ఎందుకు చేస్తున్నారు (సంతోష్ ను)

-టైప్ ఎ ఏంటీ బాబాయ్..బ్లడ్ గ్రూప్ ల్లా..మనం చేస్తున్నట్లుంది బిగినర్స్ మిస్టేక్.

-మంచి అంకుల్..మంచి ఆంటీ. పాలవాడు.పేపర్ వాడు అందరూ మంచివాళ్లేనా.

-సక్సెస్ ఎనకాల ఉరకొద్దు..ఎక్స్ లెన్సీ వెనుక ఉరకండి

-కళ్ల అద్దాలు తీసుకుని స్క్రిప్ట్ చదివితే మంచి కథలు దొరుకుతాయేమో (సంతోష్ తో)

-నెయిల్ పాలిష్ పాడవకుండా తింటారు. మీదంతా క్లాస్..మాకు సెట్ కారు(మాళవికతో)

-రిలీజ్ అయిపోయాక ఏం చేయలేం కదా

-సుదర్శన్ 35 ఫస్ట్ డే టికెట్ లు అన్నీ కొనేసి, హౌస్ ఫుల్ చేసేయాలి. బ్లాక్ బస్టర్ కావాలి.