2022 నవంబర్ లో ముందుగా ‘గ్రేట్ ఆంధ్ర’ వెల్లడించిన టైటిల్ నే ఫిక్స్ చేసారు ఎన్టీఆర్ సినిమా.
కొరటాల శివ డైరక్షన్ లో నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘దేవర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ విషయాన్నే గ్రేట్ ఆంధ్ర అప్పట్లో వెల్లడించింది. పైగా ఈ టైటిల్ లో నిర్మాత బండ్ల గణేష్ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ రెన్యూవల్ చేయడం మర్చిపోయి వదిలేసారు. దాంతో కొరటాల శివ దాన్ని తీసుకున్నారు.
రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర టైటిల్ ను ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేసారు. సముద్రం నేపథ్యంలో జరిగే మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తయారవుతోంది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నారు. జాన్వి కపూర్ కథానాయిక. అనిరుధ్ సంగీత దర్శకుడు.
ఈ సినిమా కథ మీద రకరకాల వార్తలు వున్నాయి. సముద్రపు ఒడ్డున వుండే కొండ. దాని పేరు దేవరకొండ. దానిపై వున్న దేవర మీద జనాలకు నమ్మకం ఇలా అనేకం వున్నాయి. ఇప్పుడు దేవర అన్న టైటిల్ ఈ వార్తలను మరోసారి గుర్తు చేస్తోంది.