కల్యాణ్ రామ్ తో మాకు సంబంధం లేదు – నిఖిల్

టాలీవుడ్ లో ఒక్కోసారి కొన్ని సినిమాలు గమ్మత్తుగా వస్తుంటాయి. ఒకే కాన్సెప్ట్ పై రెండేసి సినిమాలు, ఒకే టైమ్ లో వస్తుంటాయి. ఫలానా సినిమాతో మాకు సంబంధం లేదంటూ మేకర్స్ చెబుతుంటారు. కట్ చేస్తే,…

టాలీవుడ్ లో ఒక్కోసారి కొన్ని సినిమాలు గమ్మత్తుగా వస్తుంటాయి. ఒకే కాన్సెప్ట్ పై రెండేసి సినిమాలు, ఒకే టైమ్ లో వస్తుంటాయి. ఫలానా సినిమాతో మాకు సంబంధం లేదంటూ మేకర్స్ చెబుతుంటారు. కట్ చేస్తే, రెండు సినిమాల కాన్సెప్టులు ఒకేలా ఉంటాయి.
 
ఇప్పుడు కూడా అలాంటి సందర్భం వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని, మిస్టరీగా మారిన ఆయన మరణాన్ని బేస్ చేసుకొని ఒకేసారి రెండు సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఒకటి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ సినిమా కాగా, ఇంకోటి నిఖిల్ హీరోగా నటిస్తున్న స్పై సినిమా.

ఇదే అంశంపై నిఖిల్ ను ప్రశ్నించింది మీడియా. ఎప్పట్లానే నిఖిల్ ఊహించిన సమాధానమే ఇచ్చాడు. కల్యాణ్ రామ్ సినిమాతో తమ 'స్పై'కి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు.

“కల్యాణ్ రామ్ సినిమా కూడా సుభాష్ చంద్రబోస్ మీదే వస్తుందనే విషయం మా టీజర్ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. కాకపోతే అది డిఫరెంట్ స్టోరీ. కల్యాణ్ రామ్ సినిమా 1920 బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. మాది  ప్రస్తుత కాలానికి చెందిన మోడ్రన్ సినిమా. కాబట్టి కల్యాణ్ రామ్ సినిమాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. స్పై, డెవిల్ ను కంపేర్ చేయలేం. ఎందుకంటే, డెవిల్ కథ ఏంటనేది మాకు తెలుసు. మేం వాళ్లతో మాట్లాడాం. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు.”

సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రాల ఆధారంగానే స్పై సినిమా తెరకెక్కిందంటున్నాడు నిఖిల్. ఇందులో అటుఇటుగా 10శాతం మాత్రమే కల్పితం ఉంటుందని, మిగతాదంతా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ఆధారంగానే ఉంటుందని అంటున్నాడు నిఖిల్. 

స్పై సినిమాలో గూఢచారిగా నటించాడు నిఖిల్. ఇక డెవిల్ సినిమాలో కూడా కల్యాణ్ రామ్, అప్పటితరం గూఢచారిగా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది.