ఆ మధ్య చంద్రబాబు ఏడుపు సీన్ రక్తి కట్టించిన తర్వాత వల్లభనేని వంశీ, అంబటి సారీ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగిందని అనుకున్నారంతా. ప్రస్తుతం చంద్రబాబు ఏడుపు ఫొటోలు తప్ప, ఆ మేటర్ పై జనాలకి పెద్దగా ఆసక్తి కూడా లేదు.
కానీ నిన్నటికి నిన్న లోకేష్ వచ్చి.. మా అమ్మని అలా అంటారా, ఇలా అంటారా అంటూ రెచ్చిపోయారు. మీకు తల్లి లేదా, భార్య లేదా, ఆడబిడ్డలు లేరా అంటూ పంచ్ డైలాగులు వేశారు. అమ్మ సబ్జెక్ట్ ని ఆరని మంటగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
తిండి విషయానికి వచ్చి తల్లి డైలాగులెందుకు..?
చినబాబు విశాఖపట్నం వచ్చింది చిరు తిండి విషయంలో తనపై లేనిపోని కామెంట్లు చేసినందుకు. పరువు నష్టం కేసు వేసినోళ్లు, దాని విచారణకు వచ్చినోళ్లు.. దాని గురించి మాట్లాడాలి కానీ, సబ్జెక్ట్ తెలివిగా పక్కదారి పట్టించేశారు. అమ్మ సబ్జెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు లోకేష్. తన తల్లిని కామెంట్ చేసినవారిని ఊరికే వదలనని, అందరి లెక్కలు తేలుస్తానన్నారు. తల్లికి తాను మాటిస్తున్నానంటూ శపథం చేశారు చినబాబు.
ఇది టీడీపీ వాళ్లకు సంతోషాన్నివ్వచ్చేమో కానీ, నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రం లోకేష్ కు అస్సలు బుద్ధి లేదు అనిపించక మానదు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు సతీమణి పేరెత్తలేదు, కానీ పదే పదే చంద్రబాబు తన సతీమణిని అన్నారంటూ కన్నీరు కార్చారు, నందమూరి ఫ్యామిలీ అంతటితో సెల్ఫీ వీడియోలు, ప్రెస్ మీట్లు పెట్టించి మరీ దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
ఇప్పుడంతా దాని గురించి మరచిపోయిన తర్వాత లోకేష్ మళ్లీ తన తల్లి సబ్జెక్ట్ తేవడం టీడీపీలోనే కొంతమందికి నచ్చలేదు. కానీ చంద్రబాబు, లోకేష్ కి మాత్రం మాట్లాడటానికి మరో సబ్జెక్ట్ దొరకడం లేదు. లేకపోతే ఇంకా గౌరవ సభలు అని పెట్టి ఊరూవాడా చంద్రబాబు సతీమణి గురించి టముకేసుకోవడం ఎందుకు..? ఇప్పుడిలా లోకేష్ వైజాగ్ కేంద్రంగా మరోసారి మమ్మీకి మాటిస్తున్నానంటూ రెచ్చిపోవడం ఎందుకు..?
టీడీపీ ప్రయత్నాలు చూస్తుంటే 2024 వరకు దీన్ని ఆరని మంటగానే రగిల్చేలా ఉన్నారు. అమ్మ సబ్జెక్ట్ నే వచ్చే ఎన్నికల్లో హైలెట్ చేయాలనుకుంటున్నారు లోకేష్. భార్య సబ్జెక్ట్ తో మరోసారి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏడుపు సీన్ లాగించేసి సింపతీ కొట్టేయాలనుకుంటున్నారు చంద్రబాబు. వీరిద్దరికి తప్ప మిగతావారందరికీ ఈ సబ్జెక్ట్ ఏవగింపు కలిగిస్తోందనే విషయం మాత్రం వాస్తవం.