రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ రాబోతోందనే విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్ హిట్టయినప్పుడే డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు పూరి జగన్నాధ్. అది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చనుంది.
డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో రామ్ పోతినేని హీరోగా కొత్త సినిమా ప్రకటించాడు పూరి జగన్నాధ్. స్వీయదర్శకత్వంలో పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. చార్మి కూడా నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త విషయం ఏంటంటే.. సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు.
అవును.. మూవీ ఓపెనింగ్ కూడా అవ్వకుండానే, రిలీజ్ డేట్ ప్రకటించాడు పూరి.వచ్చే ఏడాది మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి ఇవే అప్ డేట్స్.
ఇందులో హీరోయిన్లు ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇస్మార్ట్ శంకర్ లో ఉన్నట్టుగానే, డబుల్ ఇస్మార్ట్ లో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్లు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఈ సినిమాతో ఎట్టిపరిస్థితుల్లో పూరి జగన్నాధ్ హిట్ కొట్టాలి. ఎందుకంటే, అతడికి లైగర్ ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఆ ఒత్తిళ్ల నుంచి బయటపడాలంటే ఈ సినిమా హిట్ అవ్వాల్సిందే.