బహుశా రేపు మంచి రోజేమో. కుర్రహీరోలంతా తమ సినిమా అప్ డేట్స్ తో రెడీ అయ్యారు. రేపు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ రాబోతున్నాయి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రేపు పవర్ ఫుల్ గ్లింప్స్ పేరిట పేరిట ఓ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. మలయాళ నటుడు జోజూ జార్జ్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.
ఇక నిఖిల్ కూడా రేపు తన కొత్త సినిమాతో హంగామా చేయబోతున్నాడు. ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ స్పై అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా టీజర్ ను రేపు ఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం-కర్తవ్య పథ్ దగ్గర విడుదల చేయబోతున్నారు. కార్తికేయ-2తో పాన్ ఇండియా అప్పీల్ అందుకున్న నిఖిల్, స్పై సినిమాను సౌత్ తో పాటు, హిందీలో ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేశాడు. జూన్ 29న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
ఇక రామ్ పోతినేని, బోయపాటి సినిమా టీజర్ కూడా రేపే రిలీజ్ అవుతుంది. దీనికి ఫస్ట్ థండర్ అనే పేరు పెట్టారు. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హిందీతో పాటు సౌత్ భాషల్లో అక్టోబర్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.