సినిమా వ్యాపారం ఎప్పుడూ ఒకలా వుంది. సర్రున పైకి లేపుతూ వుంటుంది. జర్రున కిందకు జార్చుతూ వుంటుంది. ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి ఇదే. నైజాం కింగ్ పిన్ దిల్ రాజు దాదాపు 24 కోట్లకు రెండు సినిమాల నైజాం హక్కులు కొన్నారు.
నాగ్ చైతన్య కస్టడీ. రెండోది రామ్ – బోయపాటి సినిమా. రెండూ ఒకే నిర్మాతవి కావడంతో ప్యాకేజ్ కింద కొనుగోలు చేసారు. చైతన్య సినిమా 7.20 కోట్లకు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ లెక్కన చేసారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నైజాంలో పెద్దగా వసూళ్లు సాగించడం లేదు. అందువల్ల బర్డెన్ అంతా రెండో సినిమా మీదకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అంటే దాదాపు 23 కోట్ల మేరకు రామ్ సినిమా మీద భారం వుండిపోతుంది.
ఇటీవల పంపిణీ దారుగా, నిర్మాతగా దిల్ రాజు గట్టి దెబ్బలు తిన్నారు. బలగం సంతోషం నిలవకుండానే శాకుంతలం సినిమా దారుణంగా దెబ్బతీసింది. ఇరవై కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. దాని తరువాత ఏజెంట్ సినిమాలో దాదాపు ఏడు కోట్లు చిక్కకుపోయాయి. ఇప్పుడు కస్టడీ సినిమా వచ్చింది. దీని మేరకే చూసుకుంటే అయిదు నుంచి కోట్లు పోయినట్లే.
ఇక మిగిలిన అసలైన హోప్ రామ్ చరణ్-శంకర్ సినిమానే. ఈ సినిమా జాక్ పాట్ కొడితే వంద కోట్లకు పైగా వస్తుంది. పంపిణీ దారుగా సినిమాలు చేతిలో వున్నా, భారీ రేట్లు, భారీ సినిమాలు. మహేష్-త్రివిక్రమ్ సినిమా 45 కోట్లు. ఆ మేరకు రావాలంటే అంత చిన్న విషయం కాదు. అలాగే చాలా పెద్ద సినిమాలు వున్నాయి కానీ వాటి రేట్లు కూడా పెద్దవే.
అందువల్ల దిల్ రాజుకు టోటల్ లాస్ లు కవర్ చేసి, మళ్లీ ఫుల్ డబ్బులు ఇవ్వాల్సింది..గేమ్ ఛేంజర్ సినిమానే. అది నిజంగా గేమ్ ఛేంజరే అవుతుంది అప్పుడు.