నాకు ‘అన్నీ మంచి శకునములే’

స్వప్న సినిమా నిర్మాణంలో డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. మే 18న ఈ సినిమా…

స్వప్న సినిమా నిర్మాణంలో డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో సంతోష్ శోభన్ విలేకరుల సమావేశంలో 'అన్నీ మంచి శకునములే' విశేషాలని పంచుకున్నారు.

ఈ సినిమాకు నాకు అడ్వాన్స్‌ చెక్‌ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్‌ . పేపర్‌బాయ్‌ చిత్రం తర్వాత అయిదేళ్ల ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్‌ లో వచ్చింది అనుకున్నాను. అలా ఈ సినిమా ప్రారంభమైంది. నేను కథ విన్నప్పుడు పలు పాత్రలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద నటులను ఈ సినిమాలో కలవడం అనేది చాలా సంతోషంగా ఫీలయ్యాను. 

వెన్నెల కిశోర్‌ తో ఇంతకుముందు చేశాను. కానీ మిగిలిన వారితో మొదటిసారి నటించా. ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ గారు డార్లింగ్‌ అని పిలుచుకుంటాం. ఇలాంటి పాత్ర చేసే అవకాశం యూత్‌ లో నాకే వచ్చింది అనుకుంటున్నా. తను చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. సీనియర్‌ గా ఆమె నటనానుభవాలను షేర్‌ చేసుకున్నారు.

అక్కంటే మా వాసుకి లా ఉండాలి అనిపించింది. ఆమె సూపర్‌. తొలిప్రేమ సినిమా చూశాక వాసుకి లాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో అక్కంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. ఎమోషన్స్‌, లైటర్‌ వే లో సీన్స్‌ చాలా అద్భుతంగా చేసింది. ఆమెతో ఇంకా కలిసి సినిమాలు చేయాలనిపించింది. 

నా కెరీర్‌ లో ఇలాంటి కథకానీ, ఇంతమంది నటీనటుల కాంబినేషన్‌ లో భాగమయ్యే అవకాశం రాదేమోనని అనుకుంటున్నా. నా కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ కథ, వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఆ ఫీలింగ్‌ సినిమా చేసేటప్పుడు అనిపించింది. ఈ సినిమా టైటిల్‌ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఇటీవలే ఈ సినిమాను ఎటవంటి బీజియమ్‌ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునం నాకు.

ఈ సినిమాలో యూరప్‌ లో ఒక సీన్‌ వుంటుంది. నా ఫేవరేట్‌ హీరో ప్రబాస్‌ ది పెట్టడం ఆ సీన్‌ చాలా ఫన్‌ గా వుంటుంది. సినిమాలో చూస్తే మీరు ఎంజాయ్‌ చేస్తారు. రుషి అనే పాత్ర చేశాను. ఏక్‌ మినీ కథలో బరువు మోసే పాత్ర చేశాను. ఇందులో నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పాత్ర పోషించాను. నేను ఇలా చేయగలనా! అని అనిపిస్తుంది చాలా మందికి అన్నారు సంతోష్ శోభన్.