లాక్ డౌన్ పెళ్లి.. ఇంట్రెస్టింగ్ కామెడీ

సత్య లాంటి హాస్యనటుడు హీరోగా మారాడంటే, ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందరి ఊహల్ని నిజం చేస్తూ.. ఆద్యంతం నవ్వులు పంచేలా ఓ సినిమా చేశాడు సత్య. అదే వివాహ భోజనంబు. ఈరోజు…

సత్య లాంటి హాస్యనటుడు హీరోగా మారాడంటే, ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందరి ఊహల్ని నిజం చేస్తూ.. ఆద్యంతం నవ్వులు పంచేలా ఓ సినిమా చేశాడు సత్య. అదే వివాహ భోజనంబు. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే, సత్య ఎందుకు హీరోగా మారాడో అర్థమైపోతుంది.

కరోనా టైమ్ లో పడిన కష్టాలకు కామెడీ కోటింగ్ ఇచ్చి తెరకెక్కించిన సినిమా ఇది. దీనికి పిసినారితనం అనే యాంగిల్ ను కూడా జోడించారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడని ఓ పిసినారి, లాక్ డౌన్ టైమ్ ను తన పెళ్లి కోసం చక్కగా వాడుకుంటాడు. జస్ట్ 30 మందితో పెళ్లి తంతు కానిచ్చేస్తాడు.

అయితే అప్పుడే అతడి కష్టాలు మొదలవుతాయి. పెళ్లికొచ్చిన 30 మంది లాక్ డౌన్ పొడిగించడంతో అతడి ఇంట్లోనే ఉండిపోతారు. ఇక అక్కడ్నుంచి సత్య పడిన పాట్లు ఏంటనేది సింపుల్ గా ఈ సినిమా స్టోరీ. టీజర్ లో భార్య అనుకొని, మామ నడుము పట్టుకున్నప్పుడు సత్య ఎక్స్ ప్రెషన్ చూసి తీరాల్సిందే.

సందీప్ కిషన్ నిర్మించిన ఈ సినిమాను రామ్ అనే కుర్రాడు డైరక్ట్ చేశాడు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు సందీప్ కిషన్ ఇందులో ఓ చిన్న కీలక పాత్ర కూడా పోషించాడు. అతడి పాత్ పేరు టీజర్ లో సందీప్ కూడా కనిపిస్తాడు.