యాత్ర 2.. పిక్చర్ పెర్ ఫెక్ట్

మహి రాఘవ గతంలో యాత్ర సినిమా చేస్తున్నపుడు ఎవరికీ ఏ అంచనాలు లేవు. అసలు, ఎప్పుడు మొదలుపెట్టారలో, ఎప్పుడు ఫినిష్ చేసారో తెలియదు. కానీ వన్స్ విడుదలయిన తరువాత తెలిసింది మహీ సత్తా. మమ్మట్టి…

మహి రాఘవ గతంలో యాత్ర సినిమా చేస్తున్నపుడు ఎవరికీ ఏ అంచనాలు లేవు. అసలు, ఎప్పుడు మొదలుపెట్టారలో, ఎప్పుడు ఫినిష్ చేసారో తెలియదు. కానీ వన్స్ విడుదలయిన తరువాత తెలిసింది మహీ సత్తా. మమ్మట్టి ని వైఎస్ పాత్రలోకి అలా దింపేసాడు. 

సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత చాలా కాలం యాత్ర 2 అంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. పైగా ఈసారి సినిమాలో జగన్ పాత్ర కూడా వుంటుంది. అందువల్ల కాస్త ఆసక్తి మొదలయింది. ఇక ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఈ లోగానే ఏం చేసినా చేయాలి. అని అందరూ అనుకుంటున్న టైమ్ లో యాత్ర 2 నుంచి వైఎస్ జగన్ లుక్ ను వదిలారు.

అటు మమ్మట్టి ఇటు జీవా ఇద్దరూ వైఎస్-జగన్ పాత్రల్లో పెర్ ఫెక్ట్ గా కనిపించారు. మమ్ముట్టిని వైఎస్ గా ఇంతకు ముందే చూసేసాం. ఇప్పుడు జీవాను జగన్ గా చూపించారు. పక్కాగా అలా ఒదిగిపోయాడు లుక్స్ లో అని అనిపించేలా వుంది పోస్టర్ చూస్తుంటే. మహి పెద్దగా హడావుడి చేయకుండా క్వాలిటీతో సినిమాలు చేయగల సత్తా వున్నవాడు.

అందువల్ల యాత్ర 2 ఎక్కడ మొదలై, ఎక్కడితో ఆగుతుందో అన్నది తెలియదు కనుక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి లేదు. ప్రస్తుతానికి అయితే పోస్టర్ పెర్ ఫెక్ట్.. పిక్చర్ పెర్ ఫెక్ట్ అని అనుకోవాల్సిందే.