సోష‌ల్ మీడియాకు మ‌ళ్లీ దొరికిపోయిన థ‌మ‌న్!

సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ను 'కింగ్' సినిమాలో 'జ‌య‌సూర్య' తో పోలుస్తూ.. బోలెడ‌న్ని వీడియోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇండియ‌న్ సినిమాస్ లో పెద్ద పెద్ద సంగీత ద‌ర్శ‌కులు కూడా ఈ కాపీల‌కు…

సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ను 'కింగ్' సినిమాలో 'జ‌య‌సూర్య' తో పోలుస్తూ.. బోలెడ‌న్ని వీడియోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇండియ‌న్ సినిమాస్ లో పెద్ద పెద్ద సంగీత ద‌ర్శ‌కులు కూడా ఈ కాపీల‌కు మిన‌హాయింపు కాదు.

అయితే కొంద‌రు అరుదుగా మాత్ర‌మే సొంత ట్యూన్స్ ను వాడుతూ ఉంటారు.  థ‌మ‌న్ సొంత ట్యూన్స్ ఏమో కానీ.. కాపీ కొట్టిన ట్యూన్స్  గురించి మాత్రం బీభ‌త్స‌మైన చ‌ర్చ జ‌రుగుతూ ఉంటుంది.

ఈ క్ర‌మంలో మ‌రోసారి థ‌మ‌న్ దొరికిపోయారు. క్రాక్ సినిమాకు సంబంధించి విడుద‌ల అయిన ఒక సాంగ్ విష‌యంలో కాపీ ట్యూన్ తో థ‌మ‌న్ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కు గుర‌వుతున్నారు.

క్రాక్ సినిమాను ప్లే చేస్తూ, దాని ఒరిజిన‌ల్ ను కూడా ప్లే చేస్తూ.. యాజిటీజ్ గా ఉందంటూ నెటిజ‌న్లు  య‌థారీతిన థ‌మ‌న్ ను ట్రోల్ చేస్తూ ఉంటారు.

కాపీ కొట్ట‌డం ఒక ఎత్తు అయితే.. త‌ను కాపీ కొట్టిందే లేద‌న్న‌ట్టుగా థ‌మ‌న్ చెబుతూ ఉంటారు అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైర‌ల్ అవుతూ ఉంటాయి. త‌ను కాపీ ట్యూన్లు ఇస్తే ఆ సినిమా యూనిట్ ఎలా ఒప్పుకుంటుందంటూ థ‌మ‌న్ ప్ర‌శ్నించారు గ‌తంలో.

మ‌రి వాళ్లు ఎలా ఒప్పుకుంటారో కానీ.. కాపీ జ‌రిగింద‌నేది మాత్రం ఎప్ప‌టికప్పుడు స్ప‌ష్టం అవుతూ ఉంటుంది.  

మమ్మల్ని తిట్టండ్రా బాబూ