జీరో సైజ్ ‘శకుంతల’

శకుంతల అనగానే అసమానమైన అందం, దుష్యంతుడిని అడవిలో ఆకట్టుకున్న అపూర్వ సౌందర్యం కళ్ల ముందుకు వస్తాయి. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా నుంచి పోస్టర్ వదలుతున్నారు, సమంత ఈ పోస్టర్ లో టైటిల్ రోల్…

శకుంతల అనగానే అసమానమైన అందం, దుష్యంతుడిని అడవిలో ఆకట్టుకున్న అపూర్వ సౌందర్యం కళ్ల ముందుకు వస్తాయి. దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా నుంచి పోస్టర్ వదలుతున్నారు, సమంత ఈ పోస్టర్ లో టైటిల్ రోల్ లో కనిపించబోతోంది అని తెలియగానే అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. తీరా పోస్టర్ వదిలాక అభాసు అయ్యారు.

పురాణాల్లో చదువుకున్న మాదిరిగా అడవిలో, చుట్టూ లేళ్లు ఇతరత్రా వన్య ప్రాణులతో కూర్చున్న సీన్ నే రీప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేసారు. అదంతా ఎలాగూ గ్రీన్ మ్యాట్ వ్యవహారామే కనుక, ఫస్ట్ లుక్ లో ఆర్ట్ వర్క్ ను ఆశ్రయించారు. అది బాగానే వుంది. కానీ ఆ ఆర్ట్ వర్క్ మధ్యలో సమంతను శకుంతల గెటప్ కాస్ట్యూమ్స్ లో చూపించారు.

అంతవరకు బాగానే వుంది. మరి సమంత పిక్చర్ కూడా కొంత ఫొటో షాప్ జోడించి చేసారో, మరేం చేసారో తెలెయదు కానీ గొప్పగా మాత్రం లేదు. స్టిల్ చూసిన చాలా మంది సమంత ఏమిటీ? ఇలా వుంది అని కామెంట్లు చేస్తున్నారు. మరీ జీరో సైజ్ కు దిగిపోయి. స్కిన్ తప్ప ఫ్యాట్ లేక సమంత లుక్ అంత గొప్పగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమాలో వీడియో లుక్ బాగానే వంటుందేమో కానీ ప్రస్తుతానికి ఫొటో లో సమంత లుక్ అస్సలు బాగా లేదనే భావన స్ప్రెడ్ అవుతోంది.