సంక్రాంతి బరిలోకి రావాలని బలంగా ప్రయత్నిస్తోంది గుంటూరు కారం. మహేష్-త్రివిక్రమ్ ల సూపర్ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా వున్నా, టీవీ, ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ లో ఇప్పటికీ మెమరబుల్ హిట్స్. కానీ బ్లాక్ బస్టర్ డ్యూ అన్నది వుండనే వుంది. మధ్యలో ఇద్దరికీ కొంత గ్యాప్ వచ్చినా, మళ్లీ పరిస్థితి మారింది. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కావడం అన్నది పెద్ద సమస్య కాదు. కానీ బ్లాక్ బస్టర్ కావాలి. అది త్రివిక్రమ్ కు అత్యవసరం.
ఎందుకంటే సుకుమార్, రాజమౌళి, కొరటాల శివ ఇలా ఒక్కొక్కరూ పాన్ ఇండియా దిశగా సాగిపోతున్నారు. త్రివిక్రమ్ వెళ్లాల్సి వుంది. త్రివిక్రమ్ సబ్జెక్ట్ లు పాన్ ఇండియాకు సెట్ కావు అన్న అపప్రధ వుంది. అలవైకుంఠపురములో ఇక్కడ అరి వీర భయంకర హిట్. కానీ హిందీలోకి వెళ్తే డిజాస్టర్. ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు తెలుగులో పరిస్థితి మారింది. భారీ సినిమాలకు సరిపడా సబ్జెక్ట్ లను తయారు చేసుకుని, ఆ తరహా సినిమాలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇప్పటి వరకు లేదు కానీ ఇకపై త్రివిక్రమ్ ఆ దిశగానే వెళ్లాలి. మహేష్ తరువాత చేయబోయే సినిమా బన్నీ తో. బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో చేయాలి అంటే దానికి తగ్గ ప్రిపరేషన్ అవసరం. అందుకు తగిన కథ మాత్రమే కాదు, నేమ్ కూడా కావాలి. అలా కావాలి అంటే మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం బ్లాక్ బస్టర్ కావాలి.
ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ చేసేది రాజమౌళి సినిమా. అందువల్ల మహేష్ కు ఏ సమస్య లేదు. ఆ సినిమాతో మహేష్ సినిమా వరల్డ్ థియేటర్ రేంజ్ కు వెళ్లిపోతుంది. కానీ బన్నీతో అలాంటి సినిమా త్రివిక్రమ్ తీయాల్సి వుంటుంది. అది తీయాలి అన్నది ఒక పాయింట్. అది తీయగలరు అని చిన్న ట్రయిలర్ అన్నట్లుగా గుంటూరు కారం తీసి చూపించాలి అన్నది రెండో పాయింట్.
బన్నీ తన కెరీర్ విషయంలో చాలా కచ్చితంగా వుంటారు. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి వెనుకాడక పోవచ్చు. కానీ పుష్ప 2 హిట్ రేంజ్ చూసుకుని కానీ డిసైడ్ కారు. ఇవన్నీ అలా వుంచితే మహేష్ కు కూడా తన కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన బాధ్యత త్రివిక్రమ్ మీద వుంది. అది బాధ్యత మాత్రమే కాదు. అవసరం కూడా. ఎందుకంటే అలవైకుంఠపురములో వసూళ్లు రేంజ్ కు గుంటూరు కారం అమ్మకాలు జరిపారు.
ఇలా ఎలా చూసుకున్నా గుంటూరు కారం అన్నది త్రివిక్రమ్ మీద వున్న ప్రెషర్. పైగా ఈ సినిమాను కూడా విపరీతమైన ప్రెషర్ మీదే చేస్తున్నారు. మొదటి నుంచి కిందా మీదా అవుతూనే వస్తున్నారు.. ఇప్పుడు కూడా విడుదల డేట్ మరో 60 రోజులు వుంది. షూటింగ్ కనీసం మరో 30 రోజులు వుందని తెలుస్తోంది. ఆ ప్రెషర్ కూడా కూడా త్రివిక్రమ్ దే.