బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న కాంబినేషన్ బోయపాటితోనే. ఈ లోగా అనిల్ రావిపూడి సినిమా వుంది. దానికి ముందు వీరసింహారెడ్డి చేసారు. అయినా కూడా ఫ్యాన్స్ కు బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే వున్న క్రేజ్ వేరు.
అఖండ సినిమా వల్లనే బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ తరువాత మంచి లైనప్ కొనసాగుతూంది. కానీ ఎన్నికల ముందు మాంచి పొలిటికల్ టచ్ సినిమా బాలయ్య-బోయపాటి నుంచి వస్తుంది అని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మరో సినిమా చేసే ఆలోచనలో బాలయ్య వున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ సినిమా మీద వున్నారు బోయపాటి. అది పూర్తి చేసి రావాలి. మరో రెండు నెలల్లో వచ్చేయడానికి సిద్దంగానే వున్నారు. ప్రాజెక్టు అంతా రెడీగానే వుంది. కానీ ముందస్తు ఎన్నికలు వుంటే కనుక బోయపాటి – బాలయ్య సినిమా వుండదట.
ముందస్తు ఎన్నికలు వుంటే కనుక బోయపాటితో కాకుండా బాబీతో సినిమా అనౌన్స్ చేసి ముందుకు వెళ్తారు బాలయ్య. లేదూ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వుంటే బోయపాటి సినిమా చేసి, ఆపై బాబీ సినిమా చేస్తారట.
ఈ రెండింటిలో ఏదో ఒక సినిమా పూజ అయితే జూన్ 10న వుంటుందట. బాబీ సినిమాను సితార సంస్థ నిర్మిస్తుంది. బోయపాటి సినిమాను బాలయ్య కుమార్తె, 14రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తాయి. సితార సంస్థ నిర్మాణంలో కూడా బాలయ్య కుమార్తే భాగస్వామిగా వుండే అవకాశం అయితే వుంది.
ముందస్తు ఎన్నికలు వస్తాయని బాలయ్య బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది. అందులో బోయపాటి సినిమాకు ఆల్టర్ నేటివ్ గా బాబీ సినిమాను ప్లాన్ చేసి వుంచారు.