మోనాల్.. రెమ్యూనిరేషన్

బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరికీ వారానికి ఇంత అని రెమ్యూనిరేషన్లు వుంటాయన్న సంగతి తెలిసిందే. పాల్గొనేవారి పాపులారిటీ, గ్లామర్, ఇంకా ఇతరత్రా వ్యవహారాలను బట్టి, బేరసారాలు సాగి రెమ్యూనిరేషన్ ఫిక్స్ అవుతుంది.  Advertisement…

బిగ్ బాస్ లో పాల్గొన్న వారందరికీ వారానికి ఇంత అని రెమ్యూనిరేషన్లు వుంటాయన్న సంగతి తెలిసిందే. పాల్గొనేవారి పాపులారిటీ, గ్లామర్, ఇంకా ఇతరత్రా వ్యవహారాలను బట్టి, బేరసారాలు సాగి రెమ్యూనిరేషన్ ఫిక్స్ అవుతుంది. 

ఎన్ని వారాలు హౌస్ లో వుండగలిగితే అంత మొత్తం వస్తుంది. కొంతమందికి అయితే ముందుగా మినిమమ్ ఇన్నివారాలు వుంచుతాం అనే లోపాయకారీ ఒప్పదం కూడా వుంటుందని గ్యాసిప్ వుండనే వుంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అందరి కన్నా ఎక్కువ రెమ్యూనిరేషన్ మోనాల్ కే. ఆమెకు వారానికి మూడున్నర లక్షల వరకు రెమ్యూనిరేషన్ చెల్లించారని తెలుస్తోంది. అంటే దాదాపుగా యాభై లక్షల వరకు రెమ్యూనిరేషన్ దక్కిందన్నమాట. 

నిజానికి బిగ్ బాస్ విన్నర్ కు దక్కది కూడా యాభై లక్షలే. విన్నర్ కాకపోయినా మోనాల్ కు అంత మొత్తం వచ్చేసింది. విన్నర్ అయి వుంటే ఇంకా చాలా బహుమతులు దొరికేవి. అది వేరే సంగతి. 

ఒకవేళ మోనాల్ సినిమాల్లో నటించిన కనీసం రెండు సినిమాలకు కలిపి కూడా యాభై లక్షలు రావడం కష్టం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఫామ్ లో లేదు కనుక. బిగ్ బాస్ లోంచి వచ్చాక చాన్స్ లు ఎలా వుంటాయో చూడాలి. 

ఇదిలా ఉంటే మరో పార్టిసిపెంట్ అరియానాకు వారానికి లక్ష ఇరవై అయిదువేలు రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసారని టాక్. అంటే దాదాపు ఇరవై లక్షల వరకు ఆమెకు లభించే అవకాశం వుంది. 

ఈ రెమ్యూనిరేషన్ల వివరాలు అన్నీ పక్కాగా బయటకు వస్తే, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తామనేవారి సంఖ్య కాస్త పెరుగుతుందేమో?

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్