ట్రిబ్యూట్ టు మణిరత్నం

గతంలో మరో చరిత్ర, మనుషులంతా ఒక్కటే సినిమాల్లో టైటిల్ కాన్సెప్ట్ పాటలు వచ్చాయి. సినిమా టైటిళ్లు అన్నీ గుదిగుచ్చి పాటగా మార్చడం. ఆత్రేయ రాసిన మరోచరిత్ర పాట చాలా ఫేమస్. అదే మళ్లీ హిందీలో…

గతంలో మరో చరిత్ర, మనుషులంతా ఒక్కటే సినిమాల్లో టైటిల్ కాన్సెప్ట్ పాటలు వచ్చాయి. సినిమా టైటిళ్లు అన్నీ గుదిగుచ్చి పాటగా మార్చడం. ఆత్రేయ రాసిన మరోచరిత్ర పాట చాలా ఫేమస్. అదే మళ్లీ హిందీలో కూడా అలాగే రాసారు. తరువాత తరువాత అలాంటి ప్రయోగాలు మానేసారు. 

లేటెస్ట్ గా ఖుషీ సినిమా సాంగ్ వచ్చింది. విజయ్ దేవరకొండ-మైత్రీ-శివనిర్వాణ కాంబినేషన్. ఈ పాట హీరోయిన్ మీద క్రష్ ను హీరో చెప్పే కాన్సెప్ట్ సాంగ్.

అందుకోసం మణిరత్నం సినిమాల టైటిళ్లు అన్నీ వాడుకున్నారు. దర్శకుడు శివనిర్వాణ నే ఈ పాట రాయడం విశేషం. అంతే కాదు, పాట కోరియోగ్రఫీ కూడా శివ నిర్వాణ నే. ఈ పాటలో మణిరత్నం సినిమాలు అయిన ..రోజా..దిల్ సే…అంజలి..గీతాంజలి..నాయకుడు..ఓకె బంగారం..అమృత..మౌనరాగం..ఘర్షణ, చెలియా..ఇలా అన్ని సినిమాలను కవర్ చేసేసారు. హసీమ్ అబ్దుల్ వాహిబ్ సంగీతం అందించారు పాటకు.

కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది ఖుషీ సినిమా. సమంత అనారోగ్యం కారణంగా ఆలస్యం అయింది. కోచ్చి, వైజాగ్, అన్నవరం, టర్కీ లాంటి లోకేషన్లో ఇంకా పిక్చరైజేషన్ బకాయి వుంది.