‘బ్రో’ వద్దంటున్నారు బ్రో

పీపుల్స్ మీడియా-పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్-సముద్రఖని-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘బ్రో’. ఈ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేసే లోగానే బయటకు వచ్చేసింది.  Advertisement చాంబర్ లో టైటిల్ రిజిస్టర్…

పీపుల్స్ మీడియా-పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్-సముద్రఖని-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘బ్రో’. ఈ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేసే లోగానే బయటకు వచ్చేసింది. 

చాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయడంతో బయటకు వచ్చేసింది. ఆ సంగతి అలా వుంచితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ మీద పెదవి విరుస్తున్నారు. వాళ్లకు అస్సలు నచ్చలేదు ఈ టైటిల్.

కాలం..అనే పదం వచ్చేలా పలు టైటిళ్లు పరిశీలించారు కానీ ఏదీ సంతృప్తిగా అనిపించలేదు. అనిపించిన ఒకటి రెండు వేరే సినిమాలకు ఫిక్స్ అయిపోయాయి. దాంతో ఈ బ్రో టైటిల్ కు ఫిక్స్ అయ్యారు. 

పెద్ద సినిమాలకు టైటిళ్లు పెద్దగా కీలకం కాదు. మంచి టైటిల్ వున్నా లేకున్నా క్రేజ్ వచ్చేస్తుంది. అందువల్ల తరువాత తరువాత ఈ బ్రో అనే టైటిల్ కు అలవాటు పడిపోతారు.

కానీ ముందుగా మాత్రం ట్రోలింగ్ లు, అసంతృప్తి తప్పడం లేదు. ఇదేంటి బ్రో…ఇది వద్దు బ్రో అంటూ రకరకాలుగా ఆ పదాన్ని వాడుతున్నారు. ఆ విధంగా టైటిల్ కు రీచ్ వస్తుందేమో?